టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ పేరు మీద బెంగళూరులోని వన్8 కమ్యూన్ రెస్టారెంట్ కొనసాగుతున్న విషయం తెలిసిందే. స్పోర్ట్స్ మేనియా మాత్రమే కాదు, కోహ్లీ బిజినెస్ ఆంగిల్ కూడా హాట్ టాపిక్ అవుతోంది. కానీ, ఈసారి మాత్రం పోజిటివ్ విషయంతో కాదు. ఆయన రెస్టారెంట్‌పై స్థానిక పోలీసులు సీటీబీ చట్ట ఉల్లంఘనకు సంబంధించి కేసు నమోదు చేశారు.
ఊహించని పరిణామంతో మీడియాలో హైలైట్ అయిపోయింది. వివరాల్లోకి వెళితే, బెంగళూరులోని కస్తూర్బా రోడ్‌లో ఉన్న వన్8 కమ్యూన్ పబ్‌లో ఇటీవల పోలీసులు అకస్మత్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో, అక్కడ స్మోకింగ్ కోసం ప్రత్యేకంగా కేటాయించిన ఏరియా లేదని గుర్తించారు. ఇది కోట్పా (COTPA) చట్టాన్ని ఉల్లంఘించినట్లే కావడంతో, మేనేజ్‌మెంట్‌పై చట్ట ప్రకారం చర్యలు తీసుకున్నారు.
కబ్బన్ పార్క్ స్టేషన్ పరిధిలోని ఈ పబ్‌పై సెక్షన్ 4, 21 కింద కేసులు నమోదయ్యాయి. పబ్ మేనేజర్‌తో పాటు అక్కడ పని చేస్తున్న కొంతమంది సిబ్బందిపై కూడా అధికారులు కేసులు పెట్టారు. పోలీస్ ఎస్సై మీడియాతో మాట్లాడుతూ, “ప్రతి కమర్షియల్ స్థలంలో స్మోకింగ్ జోన్ తప్పనిసరి. ఇది ప్రజా ఆరోగ్యాన్ని కాపాడే చట్టం. సదరు పబ్ నిబంధనలను పాటించకపోవడంతోనే కేసు నమోదు చేశాం” అని స్పష్టం చేశారు. చట్ట ప్రకారం ఈ నిర్లక్ష్యం జరిమానా లేదా మరింత కఠిన చర్యలకు దారితీయొచ్చు. అయితే ఘటనపై ఇప్పటివరకు కోహ్లీ ఎక్కడ స్పందించలేదు. ఇక RCB ఐపీఎల్ ఫైనల్ లో పంజాబ్ తో తలపడనున్న విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates