Suicide
ఈ మధ్య కాలంలో పాఠశాల విద్యార్థుల మానసిక స్థితిగతులపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. చిన్న విషయాలకే భయపడటం, అవమానానికి తట్టుకోలేకపోవడం.. ఇలా చిన్న వయసులోనే పెద్ద నిర్ణయాలు తీసుకునే స్థితికి చాలా మంది పిల్లలు వెళ్తున్నారు. తాజాగా పశ్చిమ బెంగాల్‌లో చోటుచేసుకున్న విషాదకర ఘటన ఇదే విషయాన్ని మరొకసారి గుర్తుచేస్తోంది.
పశ్చిమ మేదినీపూర్ జిల్లాలోని గోసాయిబేర్ బజార్ ప్రాంతంలో ఏడో తరగతి చదువుతున్న క్రిషెందు దాస్ అనే బాలుడు చిప్స్ ప్యాకెట్ తీసుకుపోయాడన్న నెపంతో ఓ దుకాణదారుడు తీవ్రంగా అవమానించాడు. అందరి మధ్యలో చెంపదెబ్బలు కొట్టి, గుంజీలు తీయించాడు. ఈ ఘటనపై తన తల్లిని కూడా ఆకస్మికంగా చూసిన బాలుడు, ఆమె నుంచి కూడా తిట్లు తిని తీవ్ర మానసిక వేదనకు గురయ్యాడు.
తనపై వచ్చిన దొంగ ఆరోపణలు తట్టుకోలేని క్రిషెందు, ఇంటికి వెళ్లి గదిలోకి మౌనంగా వెళ్లిపోయాడు. తలుపులు వేసుకొని పురుగుల మందు తాగాడు. కొన్ని గంటల తర్వాత తల్లిదండ్రులకు అనుమానం వచ్చి తలుపులు బద్దలుకొట్టగా.. అపస్మారక స్థితిలో పడిపోయిన క్రిషెందు, ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. అతని పక్కనే ఉన్న ఆత్మహత్య లేఖ చదివిన స్థానికులు కన్నీరు పెట్టుకున్నారు.
‘‘నేను దొంగను కాదు.. అమ్మా నన్ను క్షమించు..’’ అని చిన్నారి రాసిన వాక్యాలు చదవగానే చుట్టుపక్కలవారికి కన్నీళ్లతో కళ్లు చెదిరిపోయాయి. పోలీసుల దర్యాప్తుతో దుకాణ యజమాని శుభంకర్ దీక్షిత్‌పై కేసు నమోదైంది. అయితే ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడు. బాధిత బాలుడికి న్యాయం జరగాలంటూ గ్రామస్థులు డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on May 23, 2025 10:24 pm
రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రవ్యాప్తంగా కోటి సంతకాల…
కోల్కతా సాల్ట్లేక్ స్టేడియంలో ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ పర్యటన సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మెస్సీ స్టేడియంలో కేవలం…
బాలీవుడ్ లోనే కాదు ఇతర రాష్ట్రాల్లోనూ దురంధర్ ప్రభంజనం మాములుగా లేదు. మొదటి రోజు స్లోగా మొదలై ఇప్పుడు పదో…
దేశవ్యాప్తంగా మెస్సీ మ్యానియా హోరెత్తుతోంది. అర్జెంటీనా ఫుట్బాల్ లెజెండ్ లియోనెల్ మెస్సీ మూడు రోజుల పాటు జరిగే గోట్ ఇండియా…
మొన్న రాత్రి ప్రీమియర్లతో విడుదలైన అఖండ 2 తాండవం ఏపీ తెలంగాణ వ్యాప్తంగా భారీ ఆక్యుపెన్సీలు నమోదు చేసింది. తొలి…
ఈ రోజుల్లో ఒక హీరో సినిమా గురించి తన అభిమానులు చేసే పాజిటివ్ ప్రచారం కంటే.. యాంటీ ఫాన్స్ చేసే…