Trends

IPL 2025 న్యూ రూల్.. ఇక ఎవరినైనా తెచ్చుకోండి!

ఐపీఎల్ 2025లో కీలక మార్పుతో బీసీసీఐ సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇండియా పాక్ సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్‌ను వారం పాటు నిలిపివేసిన విషయం తెలిసిందే. మే 17 నుంచి మళ్లీ మ్యాచ్‌లు ప్రారంభమయ్యేలా షెడ్యూల్ విడుదలైంది. టోర్నమెంట్ ముగింపు తేదీ మే 25 నుండి జూన్ 3కి మారింది. ఈ మార్పుల వల్ల చాలా మంది విదేశీ ఆటగాళ్లు టోర్నీని విడిచి వెళ్తున్నారు. దీంతో జట్లకు ఆటగాళ్ల రీప్లేస్‌మెంట్ అవసరమైంది.

ఇందుకు అనుగుణంగా బీసీసీఐ ఇప్పుడు కొత్త నిబంధనను తీసుకొచ్చింది. ఇప్పటినుంచి ఏ జట్టు అయినా తాత్కాలిక ఆటగాళ్లను తీసుకోవచ్చని ఆదేశించింది. ఇదివరకటి నిబంధనల ప్రకారం ఒక ఆటగాడు గాయం లేదా అనారోగ్యానికి గురైతేనే రీప్లేస్‌మెంట్ తీసుకోవాల్సి ఉండేది. కానీ ఇప్పుడు జట్టు వద్దకు రాకపోయిన విదేశీ ఆటగాళ్ల స్థానంలోనూ కొత్త ఆటగాళ్లను తీసుకునే వెసులుబాటు కల్పించారు. ఇక ఆ ఆటగాళ్లు ఎవరైనా కావచ్చు, లోకల్ ఇంటర్నేషనల్ ప్లేయర్స్ ఎవరైనా కావచ్చు.

అయితే బీసీసీఐ ఈ తాత్కాలిక ప్లేయర్లపై ఓ స్పష్టతనూ ఇచ్చింది. ఇప్పుడు తీసుకునే ప్లేయర్లను వచ్చే ఏడాది జట్లు రిటైన్ చేసుకోలేవు. అంటే వాళ్లు 2026 ఐపీఎల్ వేలానికి తప్పకుండా రావాల్సిందే. జట్టు కోణంలో ఇది తాత్కాలికంగా ఉపయోగపడే మార్పే అయినప్పటికీ, రాబోయే సీజన్ వ్యూహాలకు మాత్రం ఎటువంటి అనుసంధానం ఉండదు. ఇక ఇప్పటికే టోర్నీ నిలిపివేతకు ముందు తీసుకున్న రీప్లేస్‌మెంట్లను మాత్రం రిటైన్ చేసుకోవచ్చు.

ఈ కొత్త రూల్‌తో జట్లకు చివరి దశలో తమ బలాన్ని నిలబెట్టుకోవడానికి ఒక అవకాశం లభించింది. డిల్లీ క్యాపిటల్స్‌లో జేక్ ఫ్రేజర్ మెక్‌గుర్క్, చెన్నైలో జేమీ ఓవర్టన్ వంటి ఆటగాళ్లు టోర్నీని వదిలి వెళ్లిపోయారు. వీరి స్థానాల్లో కొత్త వారిని తీసుకోవచ్చు. కానీ 2026 కోసం మళ్లీ వేలంలో పోటీ పడాలి. దీని వల్ల కొత్త అవకాశాలు లభిస్తే.. ఇక వచ్చే ఏడాది వాటిని కోల్పోతారు. ఫ్రాంచైజీలకు ఇది స్వల్ప ఊరటే అయినా, అభిమానులకు మాత్రం కొత్త ఫేస్‌లను చూసే అవకాశం. మధ్యలో వచ్చిన బ్రేక్‌కి ఇలా ఓ చక్కటి పరిష్కారం తీసుకొచ్చిన బీసీసీఐని ట్రేడ్ వర్గాలు అభినందిస్తున్నాయి. ఐపీఎల్ 2025లో మిగిలిన మ్యాచులు మరింత ఆసక్తికరంగా మారనున్నాయన్నది మాత్రం ఖాయం.

This post was last modified on May 15, 2025 12:24 pm

Share
Show comments
Published by
Kumar
Tags: IPL 2025

Recent Posts

చిరుకి మమ్ముట్టితో పోలిక ముమ్మాటికీ రాంగే

ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…

25 minutes ago

మూడున్నర గంటల దురంధర్ మెప్పించాడా

ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…

1 hour ago

అఖండ 2 నెక్స్ట్ ఏం చేయబోతున్నారు

బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…

2 hours ago

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

4 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

7 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

10 hours ago