ఐపీఎల్ 2025 సీజన్ రసవత్తరంగా సాగుతోంది. ప్లేఆఫ్స్ రేసు రోజురోజుకూ ఉత్కంఠగా మారుతోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్ ఇప్పటికే ప్లేఆఫ్స్ రేసు నుంచి వైదొలిగాయి. అయితే, ఏడు జట్లు ఇంకా టాప్-4 కోసం పోరాడుతున్నాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్రస్తుతం ఫేవరెట్‌గా కనిపిస్తోంది.
RCB 11 మ్యాచ్‌ల్లో 16 పాయింట్లతో టేబుల్ టాపర్‌గా ఉంది. రజత్ పటిదార్ నాయకత్వంలో ఈ జట్టు ఇంకొక్క విజయంతోనే ప్లేఆఫ్స్ బెర్త్‌ను ఖాయం చేసుకోవచ్చు. ఒకవేళ మరో రెండు మ్యాచ్‌లు గెలిచినట్లయితే, టాప్-2లో స్థానం సునాయాసం. ఆర్‌సీబీ ఫామ్, నెట్ రన్ రేట్ ఈ జట్టుకు బలంగా ఉన్నాయి. ఇప్పుడు ఆర్‌సీబీ అభిమానులు ప్లేఆఫ్స్ ఆశలతో సంబరపడుతున్నారు.
పంజాబ్ కింగ్స్ (PBKS) కూడా బలమైన పోటీలో ఉంది. లక్నో సూపర్ జెయింట్స్‌పై ఇటీవలి విజయం వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచింది. 11 మ్యాచ్‌ల్లో 15 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్న పీబీకేఎస్, మిగిలిన మూడు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుతుంది. ఒక్క విజయంతోనూ అవకాశం ఉంది, కానీ అది ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది.
ముంబై ఇండియన్స్ (MI), గుజరాత్ టైటాన్స్ (GT) కూడా రేసులో బలంగా ఉన్నాయి. MI 11 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో ఆరు వరుస విజయాలతో ఊపు మీద ఉంది. హార్దిక్ పాండ్యా నాయకత్వంలో రెండు విజయాలు సాధిస్తే టాప్-4 ఖాయం. GT 10 మ్యాచ్‌ల్లో 14 పాయింట్లతో ఉంది. శుభ్‌మన్ గిల్ జట్టు మిగిలిన నాలుగు మ్యాచ్‌ల్లో రెండు గెలిస్తే ప్లేఆఫ్స్‌కు చేరుతుంది.
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) రేసులో కొంచెం వెనుకబడి ఉంది. 11 మ్యాచ్‌ల్లో 10 పాయింట్లతో ఉన్న LSG, మిగిలిన మూడు మ్యాచ్‌లూ గెలవాల్సి ఉంది. అప్పుడు 16 పాయింట్లతో ప్లేఆఫ్స్ ఆశలు ఉంటాయి, కానీ ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాలి. డెల్లీ క్యాపిటల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ కూడా రేసులో ఉన్నాయి, కానీ వాటికి అవకాశాలు చాలా తక్కువ. మిగిలిన మూడు మ్యాచ్ లలో గెలవడమే కాదు, మిగతా టాప్ జట్లు వరుసగా ఓటమి చెందాలి. కానీ అది అంత ఈజీ కాదు. ఏదేమైనా ఈ సీజన్ ప్లేఆఫ్స్ రేసు నిజంగా ఉత్కంఠగా సాగుతోంది!
This post was last modified on May 6, 2025 8:55 am
1997లో విడుదలైన బోర్డర్ ఒక క్లాసిక్ మూవీ. 1971 ఇండియా పాకిస్థాన్ యుద్ధాన్ని నేపథ్యంగా తీసుకుని దర్శకుడు జెపి దత్తా…
జనవరి 9 విడుదల కాబోతున్న రాజా సాబ్ కోసం రంగం సిద్ధమవుతోంది. సంక్రాంతి సినిమాల్లో మొదటగా వచ్చే మూవీ కావడంతో…
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…