Trends

సన్ రైజర్స్.. ఇక ‘ప్లే ఆఫ్’ ఛాన్స్ ఉన్నట్టా? లేనట్టా??

ఐపీఎల్ 2025 సీజన్‌లో ప్లే ఆఫ్స్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఘోర పరాజయం పాలైంది. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన కీలక మ్యాచ్ లో 38 పరుగుల తేడాతో ఓడిపోవడంతో ఆరెంజ్ ఆర్మీ ప్లే ఆఫ్స్ రేసు నుంచి తుదిగా తలుపులు మూసుకుంది. వరుస పరాజయాలతో పాయింట్ల పట్టికలో వెనుకబడిన సన్‌రైజర్స్ ఈ ఓటమితో సీజన్ ప్రయాణాన్ని దాదాపు ముగించుకున్నట్లే

ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ భారీ స్కోరు నమోదు చేసింది. గిల్, బట్లర్, సుదర్శన్ లు సమిష్టిగా రాణించడంతో గుజరాత్ 224 పరుగులు చేసింది. కానీ ఆ లక్ష్యాన్ని చేధించడంలో సన్‌రైజర్స్ పూర్తిగా విఫలమైంది. ఒక్క అభిషేక్ శర్మ తప్ప మరెవరూ నిలకడగా ఆడలేకపోయారు. దీంతో మరో ఓటమి ఖాయం అయింది.

ప్రసిద్ధ్ కృష్ణ, సిరాజ్ ల బౌలింగ్ ధాటికి సన్‌రైజర్స్ ర్యాన్లు చిత్తయ్యారు. చెత్త ఫీల్డింగ్, ప్లాన్ లేని బ్యాటింగ్ జట్టు ఓటమికి ప్రధాన కారణాలయ్యాయి. ఇదే సమయంలో ప్రత్యర్థి గుజరాత్ ఫీల్డింగ్, మైదాన వ్యవహారం మెరుగ్గా ఉండటం విజయానికి దోహదం చేసింది. ముఖ్యంగా రషీద్ ఖాన్ క్యాచ్ మోమెంట్‌ను పూర్తిగా మార్చేసింది.

ఈ ఓటమితో సన్‌రైజర్స్ ప్లే ఆఫ్స్ రేసు నుంచి బయట పడినట్లే అని చెప్పవచ్చు. ఎందుకంటే చివరి నాలుగు మ్యాచ్‌లు గెలిచినా గరిష్టంగా 14 పాయింట్లు మాత్రమే వస్తాయి. ఈ పరిస్థితుల్లో ఇతర జట్ల ఫలితాలు, నెట్‌రన్‌రేట్ ఆధారంగా మాత్రమే అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం నెట్‌రన్‌రేట్ కూడా -1.192 ఉండటంతో అవకాశాలు లేకపోయినట్లే. టాప్ 4 లో MI – GT – RCB 14 పాయింట్స్ ఉండగా, 4వ స్థానంలో పంజాబ్ ఉంది. DC, LSG కూడా టాప్ లో ఉండేందుకు పోటీ పడుతోంది. దీంతో చివరి మూడు టీమ్ లలో ఏదో ఒకటి ఒక్క మ్యాచ్ గెలిచినా సన్ రైజర్స్ అఫీషియల్ గా ఇంటికే. 

ఐపీఎల్ 2025 సీజన్ ప్రారంభంలో మంచి ఆరంభం చేసిన సన్‌రైజర్స్ హైదరాబాద్, మిడిల్ స్టేజ్ నుంచి పూర్తిగా నిలదొక్కుకోలేకపోయింది. స్టార్ ఆటగాళ్లున్నా, ఫామ్ లో లేకపోవడం, బ్యాటింగ్-బౌలింగ్ సమన్వయం లేకపోవడంతో ఈ స్థితికి చేరుకుంది. ఇప్పుడు మిగిలిన మ్యాచ్‌లు గౌరవ పరంగా మాత్రమే మిగిలిపోయే అవకాశం ఉంది.

This post was last modified on May 3, 2025 9:25 am

Share
Show comments
Published by
Kumar
Tags: IPL 2025SRH

Recent Posts

‘ఫ్యామిలీ స్టార్’ను మరిచావా మృణాల్?

సినీ జనాలు తమ కెరీర్లో ఏదైనా పెద్ద డిజాస్టర్ ఎదురైనపుడు.. దాని గురించి తర్వాతి రోజుల్లో మాట్లాడడానికి పెద్దగా ఇష్టపడరు.…

1 minute ago

లోక్‌స‌భ‌లో రచ్చ‌ జరిగినా ఆగని బిల్లు

పార్ల‌మెంటు శీతాకాల స‌మావేశాలు శుక్ర‌వారం(రేపు)తో ముగియ‌నున్నాయి. ఈ స‌మావేశాల్లో చివ‌రి రెండో రోజైన గురువారం రాజ‌కీయ వేడి లోక్‌స‌భ‌ను కుదిపేసింది.…

10 minutes ago

శేష్ గోల్డ్ ఫిష్… ఈసారి ఎదురీదగలదా ?

రెండేళ్లు సిల్వర్ స్క్రీన్ గ్యాప్ తీసుకున్న అడవి శేష్ ఈసారి డెకాయిట్ గా రాబోతున్నాడు. టీజర్ ప్రామిసింగ్ గా అనిపించింది.…

25 minutes ago

వల్లభనేని వంశీపై మరో కేసు

వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై పలు కేసులు నమోదైన సంగతి తెలిసిందే. గన్నవరం టీడీపీ ఆఫీసుపై…

40 minutes ago

‘మిరాయ్’తో వచ్చింది… వీటితో పోయింది

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అంటే వేరే వాళ్ల భాగస్వామ్యంలో లో బడ్జెట్ సినిమాలు తీసే నిర్మాణ సంస్థ. కానీ గత కొన్నేళ్లలో…

49 minutes ago

అధికారులకు నచ్చని కలెక్టర్.. సీఎం ఒక్క ఛాన్స్ ఇస్తే?

పై అధికారులకు ఆ కలెక్టర్ ఎందుకో నచ్చలేదు.. నీ మీద ఇటువంటి అభిప్రాయం ఉందని స్వయంగా సీఎం ఆ కలెక్టర్…

1 hour ago