ప్రపంచం వేగంగా మారుతోంది. టెక్నాలజీ అభివృద్ధి ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోంది. ఇప్పటికే ఐటీ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), ఆటోమేషన్ వల్ల వేలాది ఉద్యోగాలు మాయం కావడం చూశాం. ఇప్పుడు అదే ప్రభావం ఎంటర్టైన్మెంట్ రంగానికి కూడా చేరువవుతోంది. చిన్న వీడియోలు, వర్చువల్ యాక్టర్స్, ఏఐ టూల్స్ వల్ల సాధారణ సృజనాత్మక వృత్తులు తక్కువ అవుతున్నాయి.
ఇప్పుడు అదే ప్రభావం వైద్య రంగంపై పడుతున్నట్లు అనిపిస్తోంది. ఎలాన్ మస్క్ వంటి టెక్ లీడర్లు రాబోయే ఐదేళ్లలో రోబోలు మానవ సర్జన్లను మించిన నైపుణ్యం చూపుతాయని చెప్పడం, ఈ భయాలను మరింత బలపరుస్తోంది. రోబోటిక్ సర్జరీలు, ఆటోమేటెడ్ డయాగ్నోస్టిక్ టూల్స్ అభివృద్ధి చెందడం చూస్తే, రాబోయే తరం వైద్యులు కేవలం సామర్థ్యంతో కాదు, టెక్నాలజీ అవగాహనతో కూడిన ప్రత్యేక నైపుణ్యాలతో సిద్ధమవ్వాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఒక కోణంలో ఇది ఆరోగ్యరంగ అభివృద్ధికి ఉపయోగపడవచ్చు. ఎక్కువ మందికి త్వరగా, ఖచ్చితమైన చికిత్స అందే అవకాశం పెరుగుతుంది. కానీ మరోవైపు, సాంప్రదాయ వైద్య విద్య పూర్తిచేసుకున్న వారు లేదా చిన్న చిన్న హాస్పిటల్స్ నడుపుతున్న వారు ఈ టెక్నాలజీ పోటీకి నలిగిపోతారనే ఆందోళన ఉంది.
సాధారణంగా చెప్పాలంటే, మారుతున్న ప్రపంచంలో నిలబడాలంటే వైద్య వృత్తిదారులు తమ నైపుణ్యాలను కేవలం మెడికల్ నాలెడ్జ్ వరకు పరిమితం చేసుకోకుండా, టెక్నాలజీ, రోబోటిక్స్, డేటా అనలిటిక్స్ వంటి విభాగాల్లో కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచం కొత్త దారిలో పయనిస్తున్నప్పుడు, హేతుబద్ధమైన అభివృద్ధి అవసరం. టెక్నాలజీ మన శత్రువుకాక, మిత్రుడిగా మారాలంటే.. మానవతా విలువలతో, సమతుల్య అభివృద్ధితో ముందుకెళ్లాల్సిన సమయం ఇది అంటూ పలువురు సూచనలు ఇస్తున్నారు.
This post was last modified on April 28, 2025 7:58 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…