ఐపీఎల్‌లో సాధారణంగా ఎక్కువ స్కోర్లు మాత్రమే విజయం అందిస్తాయని అనుకునే వారికి, పంజాబ్ కింగ్స్ తన తాజా విజయంతో ఊహించని షాక్ ఇచ్చింది. ముల్లాన్‌పూర్ వేదికగా KKR తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని విజయవంతంగా కాపాడింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు అత్యల్ప స్కోరుగా నిలిచింది. ఈ విజయం ఒక్క మ్యాచ్ కాదు, ఒక రీబౌండ్, గత మ్యాచులో 245 పరుగుల స్కోరు కూడా కాపాడలేకపోయిన జట్టు ఇప్పుడు అద్భుతంగా బౌన్స్ బ్యాక్ అవ్వడం విశేషం.
మొదట్లోనే పంజాబ్ బ్యాటింగ్‌లో తడబడింది. తక్కువ ఓవర్లకే వికెట్లు కోల్పోయింది. కేవలం ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (30), ప్రియాంశ్ ఆర్య (22) మాత్రమే పోరాడారు. కానీ కేకేఆర్ బౌలర్లు హర్షిత్ రాణా, నరైన్, చక్రవర్తి అత్యద్భుతంగా రాణించడంతో పంజాబ్ 15.3 ఓవర్లలో కేవలం 111 పరుగులకే కుప్పకూలింది. అప్పటిదాకా చూస్తే, విజయం సాధించటం చాలా అసంభవంగా కనిపించింది. కానీ మలుపు అక్కడే మొదలైంది.
పంజాబ్ బౌలింగ్‌లో జాన్సన్, చాహల్, అర్షదీప్ లాంటి బౌలర్లు అద్భుతంగా ఆడారు. చాహల్ 4 వికెట్లు తీసి తన మేజిక్ స్పెల్‌తో మళ్లీ ఒరిజినల్ ఫామ్ చూపించి కీలకమైన వికెట్లు తీసాడు. రాహనే కూల్‌గా మ్యాచ్ హ్యాండ్‌షేక్‌కి వచ్చినా, అతడు రివ్యూ తీసుకోకపోవడం ఆ దశలో టర్నింగ్ పాయింట్ అయ్యింది. రఘువంశీ (37) ఒక స్థిరత చూపినా, మిగతా బ్యాటర్లంతా కట్టుబడకపోవడంతో కేకేఆర్ 95 పరుగులకే ఆలౌట్ అయింది.
111 పరుగులు టార్గెట్ ను జెట్ స్పీడ్ లో ఫినిష్ చేస్తారనికుంటే KKR ఊహించని విధంగా బోల్తా పడింది. పంజాబ్ బౌలర్లు అందరి అంచనాలనూ తలకిందులు చేశారు. మార్కో జాన్సన్ (3/17), చాహల్ (4/28) మేజిక్ చూపించగా, మ్యాక్స్‌వెల్, అర్షదీప్ కూడా తమ వంతు పాత్ర పోషించారు. ఆఖర్లో రస్సెల్ ఒక్క ఓవర్‌లో 16 పరుగులు కొట్టినా, ఆ తర్వాత వరుసగా వికెట్లు పడిపోవడంతో కేకేఆర్ ఆశలు గాలిలో కలిసిపోయాయి.
ఈ విజయం పంజాబ్‌కు ఒక గేమ్ మాత్రమే కాదు, మానసికంగా తిరిగి లేచే బలాన్నిచ్చింది. తక్కువ స్కోరులో కూడా టీ20 మ్యాచులు ఎంత థ్రిల్లింగ్‌గా ఉంటాయో ఈ మ్యాచ్ నిరూపించింది. అట్టడుగు నుంచి పైకి రావడం ఎలా ఉండాలో ఈ గేమ్ చూపించింది. T20 క్రికెట్‌లో మాయాజాలానికి స్కోరు అవసరం లేదు.. సమయానికి చురుకైన వ్యూహం ఉంటే చాలనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.
This post was last modified on April 16, 2025 6:48 am
నాకు డబ్బులే కావాలనుకుంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునే వాడ్ని, రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటున్న వాళ్లకు…
ఇండియాస్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి దగ్గర దర్శకత్వ విభాగంలో పని చేయాలని కాబోయే డైరెక్టర్ కావాలనుకున్న ప్రతి వ్యక్తికీ…
అనుకున్నట్టే ది ప్యారడైజ్ ట్రైలర్ రావడం లేదు. రిలీజ్ డేట్ సెప్టెంబర్ 24 మీద చాలా ఒత్తిడి ఉండటంతో ఇప్పటికిప్పుడు…
తెలుగు సినిమాల వింటేజ్ అభిమానుల ప్రధాన సమస్య ఒకటే. చాలా క్లాసిక్ మూవీస్, బ్లాక్ బస్టర్స్ సరైన రీతిలో ఆన్…
ఇప్పటిదాకా అన్ని భాషల్లో కలిపి కొన్ని వందల హారర్ సినిమాలు వచ్చి ఉంటాయి. హాలీవుడ్ ఈవిల్ డెడ్ తో మొదలుపెట్టి…
బాలీవుడ్ లో సంచలన వసూళ్లు నమోదు చేస్తున్న హనుమాన్ అంశ్ తెలుగులో సెప్టెంబర్ 18 విడుదల కానుంది. ఆశ్చర్యం కలిగించే…