2013, ఫిబ్రవరి 21 నాటి దిల్‌షుక్ నగర్ పేలుళ్ల కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. ఈ కేసులో దోషులుగా తేలిన ఐదుగురికి ఎన్ ఐఏ కోర్టు ఇప్పటికే విధించిన ఉరి శిక్షను ఖరారు చేసింది. 2016 లోనే దీనిపై విచారణను పూర్తి చేసిన ఎన్ ఐఏ కోర్టు.. దోషులకు ఉరి శిక్ష విధించింది. అయితే.. దోషులు.. ఈ తీర్పును సమీక్షించి.. తమను ఉరి శిక్ష నుంచి తప్పించాలని కోరుతూ.. తెలంగాణ హైకోర్టును ఆశ్ర యించారు. దీనిపై పలుదఫాలుగా విచారణ జరిపిన హైకోర్టు మంగళవారం(ఈరోజు) ఉదయం తీర్పు వెలువరించింది.
ఎన్ ఐఏ కోర్టు ఇచ్చిన ఉరి శిక్ష తీర్పును హైకోర్టు సమర్థించింది. ‘ఉరి శిక్ష సరైందే’ అని కోర్టు వ్యాఖ్యానిం చింది. అయితే.. ఈ కేసులో రియాజ్ భత్కల్ ఇప్పటికీ పరారీలోనే ఉన్నట్టు అధికారులు కోర్టు కు తెలిపా రు. నాటి కేసులో 18 మంది అక్కడికక్కడే మృతి చెందగా 131 మంది తీవ్రంగా గాయపడ్డారు. అత్యంత రద్దీగా ఉండే దిల్‌షుక్ నగర్‌లో జంట పేలుళ్ల ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిం చింది.
దీనిని ఎన్ ఐఏకు అప్పగించడంతో వడివడిగా విచారణ పూర్తయింది. ఈ క్రమంలోనే ఎన్ ఐఏ ప్రత్యేక కోర్టు దోషులకు ఉరి శిక్ష విధించింది. దీనిని తాజాగా తెలంగాణ హైకోర్టు సమర్థించింది. కాగా.. న్యాయమూర్తులు జస్టిస్‌లక్ష్మణ్, జస్టిస్ సుధలతో కూడిన ధర్మాసంన ఎన్ ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ.. దోషులు వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది.
ఉరి శిక్ష వీరికే!
అసదుల్లా అక్తర్
తహసీన్ అక్తర్
జియా ఉర్ రెహమాన్
భక్తల్ అజాజ్
ఐజాజ్ షేక్