అమెరికాలోని శాస్త్రవేత్తలు చరిత్రలో ఒక విప్లవాత్మక అధ్యాయాన్ని తిరిగి రాశారు. ఐస్ ఏజ్‌లో దాదాపు 10,000 సంవత్సరాల క్రితం అడవుల్లో గర్జించిన ‘డైర్ వుఫ్స్’కు సంబంధించిన జీనెటిక్స్‌ను తిరిగి సృష్టించడంలో ఘన విజయాన్ని సాధించారు. కోలస్సల్ బయోసైన్సెస్ సంస్థ ఆధ్వర్యంలో పరిశోధకులు జీన్లు సవరించి, మూడు డైర్ వుఫ్‌లలాంటి నక్క పిల్లలను అభివృద్ధి చేశారు. వీటి వయస్సు మూడు నుండి ఆరు నెలల మధ్య ఉండగా, ప్రస్తుతం అమెరికాలో ఓ సురక్షిత ప్రాంతంలో వీటిని పెంచుతున్నారు.
ప్రాచీన డీఎన్ఏ ఆధారంగా అభివృద్ధి చేసిన ఈ నక్కలు, అసలైన డైర్ వుఫ్‌లతో పోలిస్తే ఆకారంలో భారీగా ఉండే జాతిని పోలి ఉండటం ఆశ్చర్యకరం. శాస్త్రవేత్తలు ఓహియోలో లభ్యమైన 13,000 ఏళ్ల పురాతన పళ్లూ, ఐడహోలో లభించిన 72,000 ఏళ్ల పూర్వపు కపాలాన్ని విశ్లేషించి డైర్ వుఫ్ జన్యుగత లక్షణాలను గుర్తించారు. అనంతరం క్రిస్‌పర్ టెక్నాలజీ సహాయంతో గ్రే వుఫ్ జాతికి చెందిన రక్త కణాలను 20 చోట్ల మార్పులు చేసి, వాటిని పెంపుడు కుక్కల గర్భాశయంలోకి వదిలారు. ఇక 62 రోజుల గర్భధారణ అనంతరం ఈ నక్క పిల్లలు జన్మించాయి.
అయితే వీటి ప్రవర్తన మాత్రం అసలైన డైర్ వుఫ్స్ మాదిరిగా ఉండబోదని కోలస్సల్ సంస్థ జంతు సంరక్షణ నిపుణుడు మ్యాట్ జేమ్స్ తెలిపారు. “వీటికి పెద్ద ఎల్క్‌ను ఎలా వేటాడాలో, చివరికి ఎలా చంపాలో తెలియదు. ఇది తల్లిదండ్రుల నుండి వచ్చే ప్రవర్తనా బోధనే కాకుండా, వారి అనుభవానికి దగ్గరగా కూడ కాకపోవచ్చు,” అని ఆయన వ్యాఖ్యానించారు.
సైన్స్‌లో ఈ ప్రయోగం ఎంతైనా గొప్పదే అయినా, ఇది పూర్తిగా ఒక జాతిని తిరిగి తీసుకొచ్చిందని చెప్పడం కష్టమేనని ఇండిపెండెంట్ శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు. “ఇప్పుడు చేయగలిగేది కేవలం ఒక జాతిని పోలిన ఆకారాన్ని తయారు చేయడమే,” అని యూనివర్సిటీ ఆఫ్ బఫలోకి చెందిన జీవ శాస్త్రవేత్త విన్సెంట్ లించ్ అన్నారు. కోలస్సల్ సంస్థ గతంలో వూల్లీ మమ్మత్స్, డోడో పక్షులు వంటి అంతరించిపోయిన జాతులను తిరిగి తీసుకొచ్చే ప్రాజెక్టులను కూడా ప్రకటించింది. తాజాగా, అమెరికాలో అత్యంత అరుదైన రెడ్ వుఫ్ జాతికి చెందిన నాలుగు నక్కలను గర్భధారణ ద్వారా పునరుత్పత్తి చేసినట్లు వెల్లడించింది. ఈ ప్రయోగాలు భవిష్యత్‌లో అంతరించిన జీవజాతుల పునరుత్థానానికి దారితీస్తాయా అనే ఆసక్తి మాత్రం పెరుగుతోంది.
This post was last modified on April 8, 2025 9:55 am
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…