తిమిరి ఇసుకన తైలంబు తీయవచ్చు.. అని భతృహరి శుభాషితం చెబుతున్నా.. బట్టతలపై వెంట్రుకలు మొలిపించడం మాత్రం ఎవరికీ సాధ్యం కాదనేది అందరికీ తెలిసిందే. లేకపోతే.. ప్రపంచ కుబేరులు సైతం.. బట్టతలతోనే ఎందుకు బతుకుతారు? అనేది ప్రశ్న. కోట్లకు పడగలెత్తిన వారుకూడా.. విగ్గులను ఎందుకు ఆశ్రయిస్తారన్నది మరో ప్రశ్న. సో.. బట్టతల పై వెంట్రుకలు మొలిపించడం అన్నది సాధ్యం కాదు. ఈ విషయం తెలిసి కూడా.. కొందరు మోసపోతూనే ఉన్నారు.
మోసకారులు ఉన్నంత వరకు.. మోసం చేసేవారు ఉన్నారన్నట్టుగా.. తాజాగా బట్టతలపై వెంట్రుకలను చిటెకలో మొలిపిస్తానంటూ.. వచ్చిన కొందరు వ్యక్తులు మన హైదరాబాదీలకు పక్కగా గుండుకొట్టారు. ఉన్న వెంట్రుకలు కూడా తీసేసి.. తైలం రాశారు. ఇంకేముంది.. 24 గంటల్లో తుమ్మ మొక్కలు మొలిచినట్టు మీ నెత్తిపై వెంట్రుకలు వచ్చేస్తాయని చెప్పారు. ఇది నిజమేనని నమ్మిన హైదరాబాదీలు క్యూ కట్టి మరీ.. సదరు వ్యక్తులను నమ్మారు. చివరకు పక్కాగా మోస పోయారు.
ఏం జరిగింది?
బట్టతలపై వెంట్రుకలు మొలిపిస్తానంటూ ఢిల్లీకి చెందిన వకీల్ అనే వ్యక్తి సోషల్ మీడియాలో ప్రకటన చేశాడు. దీనిని నమ్మిన కొందరు వ్యక్తులు నిజంగానే తమ బట్టతలకు బ్రహ్మాండమైన రోజులు వస్తున్నాయని భావించారు. ఇంకేముంది.. వకీల్ చెప్పిన చోటుకు క్యూ కట్టారు. ఇలా వచ్చిన వారి నుంచి వకీల్ ఒక్కొక్కరి దగ్గర రూ. 100 తీసుకుని గుండు కొట్టేశాడు. అంటే.. ఉన్న కొద్దిపాటి వెంట్రుకలు తీసేశాడు. అనంతరం.. గుండుపై కెమికల్స్ రాసి పంపించాడు.
ఈ సందర్భంగా గుండు ఆరిపోకుండా ఉంచాలని షరతు పెట్టాడు. ఇలా 24 గంటలు ఉంటే.. బ్రహ్మాండంగా వత్తుగా వెంట్రుకలు పెరుగుతాయని వాగ్దానం కూడా చేశాడు. తీరా చూస్తే.. ఇలా కెమికల్ రాయడంతో చాలా మందికి అది రియాక్షన్ అయి బొబ్బలు వచ్చాయి. బట్టతలపై వెంట్రుకల మాట ఎలా ఉన్నా.. వందలాది మంది యువకులు ఉన్న జుట్టు కూడా పోయి.. లబోదిబోమంటున్నారు. ఏదేమైనా.. బట్ట తల కూడా అదృష్టమే అనుకుంటే.. ఏ గొడవా ఉండదు కదా.. అంటున్నారు… జుట్టున్న యువకులు.
This post was last modified on April 7, 2025 6:54 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…