ఏపీలోని అన్నమయ్య జిల్లాలో సోమవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో జిల్లా కేంద్రానికి వెళుతున్న డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారిణి దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు వ్యక్తులు గాయపడ్డారు. హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టులో భాగంగా అన్నమయ్య జిల్లా పరిధికి సంబంధించి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా సుగాలి రమ విధులు నిర్వర్తిస్తున్నారు. జిల్లాలోని పీలేరు కేంద్రంగా ఆమె విధులు నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం జిల్లా కేంద్రంలో గ్రీవెన్స్ సెల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. సోమవారం కూడా గ్రీవెన్స్ సెల్ కు హాజరయ్యే నిమిత్తం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటికి రమ కారులో బయలుదేరారు. అయితే ఆమె తన గమ్యస్థానం చేరకముందే మృత్యువాత పడ్డారు.
పీలేరు నుంచి రాయచోటికి వెళుతున్న క్రమంలో సంబేపల్లి మండలం ఎర్రగుంట్ల వద్ద ఎదురుగా వస్తున్న కారును స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ప్రయాణిస్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో రమ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా ఈ ప్రమాదంలో మరో నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే హుటాహుటీన అక్కడికి చేరుకున్న పోలీసులు… రమ మృతదేహాన్ని పోస్టు మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇక ప్రమాదంలో గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ప్రజా ఫిర్యాదులు స్వీకరించేందుకు వెళుతున్న సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదా కలిగిన మహిళా అధికారి మరణం అధికార వర్గాలను విషాదంలో ముంచేసింది.
ఇదిలా ఉంటే.. ఈ ప్రమాదం గురించిన సమాచారం తెలిసినంతనే టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు దిగ్భ్రాంతికి గురయ్యారు. గ్రీవెన్స్ సెల్ లో ప్రజా ఫిర్యాదులను స్వీకరించేందుకు వెళుతున్న రమ మృతి చెందడం దురదృష్ణకరమని ఆయన అన్నారు. రమ కుటుంబ సభ్యులకు ఆయన తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా చంద్రబాబు ఓ సంతాప ప్రకటనను విడుదల చేశారు. ఇక ఈ ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించేందుకు ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని చంద్రబాబు తెలిపారు.
This post was last modified on April 7, 2025 2:51 pm
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…