Trends

క్రికెట్ ఫ్యాన్స్ ను కొట్టబోయిన పాక్ ఆటగాడు

పాకిస్థాన్ క్రికెట్ జట్టు వరుస పరాజయాలతో విసిగిపోయింది. తాజాగా న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌లో 0-3 తేడాతో ఓడిన తర్వాత అభిమానుల ఆగ్రహం తారాస్థాయికి చేరింది. అయితే ఓటమికి బాధపడటం ఒక వైపు ఉంటే, ఆ క్షోభను కంట్రోల్ చేయలేకపోయిన పాకిస్థాన్ ఆటగాడు ఖుష్దిల్ షా ఇంకొక వైపు వార్తల్లో నిలిచాడు. మ్యాచ్ అనంతరం అతని ప్రవర్తన క్రికెట్ అభిమాని సమాజాన్ని కలవరపరచింది.

మూడో వన్డే ముగిసిన వెంటనే ఖుష్దిల్ షా స్టాండ్స్ వైపు పరుగెత్తి ప్రేక్షకులను నిలదీయడం, వారిని బెదిరించేందుకు ప్రయత్నించడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనికి కారణం మ్యాచ్ అనంతరం కొంతమంది ఆఫ్ఘన్ క్రికెట్ అభిమానులు పాక్ ఆటగాళ్లను దుర్భాషలాడటం అని తెలుస్తోంది. ఖుష్దిల్ వారిని సైలెంట్ చేసేందుకు ప్రయత్నించినా.. దురుసు మాటలతోనే ఎదుర్కొనడంతో కోపం తాళలేక ఆ దిశగా దూసుకెళ్లాడు. అయితే అక్కడే మిగతా ప్లేయర్లు, సెక్యూరిటీ అధికారులు జోక్యం చేసుకోవడంతో పెద్ద సమస్య తప్పింది.

ఈ ఘటనపై పాక్ క్రికెట్ బోర్డు (PCB) స్పందిస్తూ.. తమ ఆటగాళ్లను లక్ష్యంగా తీసుకొని ఏ విదేశీ అభిమానులు అవమానకరంగా ప్రవర్తించినా తాము సహించబోమని పేర్కొంది. మైదానంలో ఆటగాళ్లకు గౌరవం ఇవ్వాలని, అలాంటి దురుసు ప్రవర్తనను ఖండిస్తున్నామని వెల్లడించింది. అదే సమయంలో తమ ఆటగాళ్లు కూడా ఎలాంటి ఉద్రిక్తతకు లోనుకాకుండా స్పందించాలని సూచించినట్టు సమాచారం.

ఇక క్రికెట్ అభిమానులు ఈ అంశంపై రెండు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది ఖుష్దిల్‌కి మద్దతుగా నిలుస్తూ.. వ్యక్తిగత అవమానాలు చేస్తే ఎవ్వరైనా మానవత్వంతో స్పందించాల్సిందే అంటున్నారు. మరికొంతమంది మాత్రం అంతర్జాతీయ క్రికెట్ ప్లేయర్‌గా వ్యవహరిస్తున్నావంటే నియంత్రణ కావాలని, ఫిర్యాదు చేయడం ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని అంటున్నారు. మొత్తానికి ఓ పరాజయం మాత్రమే కాదు.. దాని ప్రభావం ఆటగాళ్ల మానసిక స్థితిపై ఎంతగానో పడుతున్న విషయం ఖుష్దిల్ చర్యల ద్వారా మరోసారి రుజువైంది. 

This post was last modified on April 6, 2025 3:08 pm

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

1 hour ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

3 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

5 hours ago