ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పరిస్థితి ఆశించినంత బాగాలేదు. తొలి మ్యాచ్‌లో పరుగుల వర్షం కురిపించిన జట్టు, ఆ తరవాత పూర్తిగా తడబడింది. వరుసగా మూడు పరాజయాలతో పాయింట్ల పట్టికలో చివరికి జారింది. ఇప్పటివరకు నాలుగు మ్యాచుల్లో కేవలం ఒకటి మాత్రమే గెలవడంతో రెండు పాయింట్లకే పరిమితమైంది. నేడు గుజరాత్ టైటన్స్‌తో హోం గ్రౌండ్‌లో తలపడబోతుండగా, ఈ మ్యాచ్‌లో విజయం అత్యంత కీలకం.
బ్యాటింగ్‌లో ఒక్క మ్యాచ్ తప్ప మిగిలినవన్నీ నిరుత్సాహపరిచాయి. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ లాంటి భారీ హిట్టర్లు ఉన్నా, ఒకరి తర్వాత ఒకరు వెంట వెంటనే అవుటవుతుండటంతో జట్టు భారీ స్కోర్లకు చేరడం సాధ్యపడడం లేదు. మిడిల్ ఆర్డర్ పూర్తిగా తేలిపోవడమే ఓటములకు కారణమవుతోంది. అభిషేక్ ఒక్కొసారి మెరుస్తున్నా, స్థిరత లేకపోవడం అభిమానుల్లో నిరాశను కలిగిస్తోంది.
ఇంకా కెప్టెన్ పాట్ కమ్మిన్స్ నేతృత్వంలో బౌలింగ్ కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. ఒకప్పుడు మ్యాచ్‌లను తిరగరాస్తూ కట్టిపడేసే సన్‌రైజర్స్ బౌలింగ్ యూనిట్.. ఇప్పుడు ప్రెషర్ సిచ్యుయేషన్లలో తేలిపోతుంది. తొలి మ్యాచ్‌లో రాజస్థాన్‌కు 240 పైచిలుకు పరుగులు ఇవ్వడం సునాయాసంగా ఊహించనిది. వరుసగా ఓటములు ఇలానే కోనసాగితే ప్లే ఆఫ్స్ రేసులో ఉన్న ఆశలు కూడా మందగిస్థాయి.
ఈ నేపథ్యంలో గుజరాత్‌పై హోం గ్రౌండ్‌లో జరిగే మ్యాచ్ కీలకం. మరోసారి ఓడిపోతే జట్టు మరింత ఒత్తిడిలోకి వెళ్లడం కాయం. బ్యాటింగ్‌లోనైనా, బౌలింగ్‌లోనైనా ఈసారి స్పెషల్ చూపించాల్సిన అవసరం ఉంది. తొలి మ్యాచ్‌లలో చూపించిన ‘కాటేరమ్మ కొడుకుల’ శక్తిని మళ్లీ చాటితేనే జట్టుకు బలం కలుగుతుందని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి ఈసారి ఈ ఆరెంజ్ ఆర్మీ ఎలాంటి ప్రదర్శన ఇస్తుందో చూద్దాం.
This post was last modified on April 6, 2025 10:09 am
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…