స్టాండప్ కామెడీ నవ్వు తెప్పించడం సంగతేమో గానీ… కట్టుబాట్లను మాత్రం చాలా సునాయసంగా దాటేస్తోంది. భారత సమాజం గుట్టుగా ఉంచే కార్యకలాపాలను స్టాండప్ కమెడియన్ల పేరిట బయటకు వస్తున్న కొందరు వ్యక్తులు వాటిని బహిరంగ చర్చకు పెట్టేసి కంపు చేసేస్తున్నారు. మొన్నటికి మొన్న రణవీర్ అహ్లాబాదియా వ్యవహారం దేశవ్యాప్తంగా పెను విమర్శలకు కారణమైంది. కేసులనూ, కోర్టు అక్షింతనూ ఎదుర్కొన్నాడు. అతడి ఉదంతాన్ని మరువక ముందే కునాల్ కామ్రా పాలకులనే విమర్శించి బుక్కయ్యాడు. ఇప్పుడు లేడీ స్టాండప్ కమెడియన్ స్వాతి సచ్ దేవా వంతు వచ్చింది.
ఢిల్లీకి చెందిన స్వాతి ప్రతిష్ఠాత్మక అమిటీ యూనివర్సిటీలో విద్యనభ్యసించారు. ఆ తర్వాత ఆమె స్టాండప్ కమెడియన్ గా కెరీర్ ను ప్రారంభించారు. ఓ మోస్తరు అడల్డ్ కంటెంట్ ఆమె షోలలో ఉంటుందని చాలా రోజులుగానే విమర్శలు వినిపిస్తు న్నాయి. తాజాగా ఆమె కామెడికి చెందిన ఓ క్లీప్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. అదేదో ఆమె కామెడీ బాగుందని కాదు… నాలుగ్గోడల మధ్య మాట్లాడుకోవాల్సిన విషయాన్ని బహిరంగ వేదికలపైకి తీసుకురా వడమే కాకుండా దానిని కామెడీగా అభివర్ణించి… కన్న తల్లి ప్రస్తావనను తీసుకువచ్చి…ఓ వైబ్రేటర్ గరించి తల్లి తనతో సంభాషించారని చెప్పడం నిజంగానే జుగుత్పనే కలిగించింది.
ఈ షొలో స్వాతి తనకు, తన తల్లికి మధ్య జరిగిన సంభాషణ అంటూ అభ్యంతరకర సన్నివేశాలను చెబుతూ నవ్వడం, దానిని విన్న ప్రేక్షకులు కూడా ఇకిలించిన తీరుపై ఇప్పుడు సర్వత్రా విమర్శలు రేగుతున్నాయి. ఓ పెళ్లి కాని యువతి అయి ఉండి… అభ్యంతకర సన్నివేశాలను తన తల్లి తనతో చర్చించిందంటూ స్వాతి చెప్పిన తీరు అభ్యంతరకరమేనని చెప్పక తప్పదు. కామెడీ అన్నాక హద్దుల్లో ఉన్నంత వరకేనని… అదే హద్దులు దాటే కామెడీ.. జుగుత్పేనని గుర్తుంచు కోవాలని పలువురు స్వాతిపై విరుచుకుపడుతున్నారు. స్టాండప్ కామెడీ పేరిట వీరు బూతులతో చెలరేగి పోతన్నారన్న విమర్శలు అంతకంతకూ పెరుగుతున్నాయి. మరి స్వాతి ఈ విమర్శల సుడి నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.
This post was last modified on March 31, 2025 10:08 am
మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయాలని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోకి వచ్చే ప్రతి దర్శకుడికీ ఆశ ఉంటుంది. కానీ ఆ కల…
రాష్ట్ర విభజనతో అసలే అప్పులతో ప్రస్థానం మొదలుపెట్టిన నవ్యాంధ్రను గత వైసీపీ ప్రభుత్వం మరింత అప్పుల్లో కూరుకు పోయేలా చేసింది.…
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు మారిపోయారంటూ ఆ పార్టీకి చెందిన నేతలు, కరడుగట్టిన అభిమానులే బలంగా చెబుతున్నారు.…
మనకు డాల్బీ సౌండ్ పరిచయమే కానీ డాల్బీ సినిమా ఎలా ఉంటుందో ఇంకా అనుభవం కాలేదు. ఇప్పటిదాకా విదేశాల థియేటర్లలో…
హనుమాన్ తర్వాత గ్యాప్ వస్తున్నా సరే తదేక దృష్టితో తేజ సజ్జ చేస్తున్న సినిమా మిరాయ్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ…
క్రిస్టియన్ మత ప్రభోదకుడు పగడాల ప్రవీణ్ మృతి వ్యవహారం గత కొన్ని రోజులుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన సంగతి…