ఖరీదైన వస్తువుల్ని కొనుగోలు చేసే విషయంలో భారత కుబేరుడు రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ ఎప్పుడూ ముందుంటారు. ఆయన కొనుగోలు చేసిన ఖరీదైన బోయింగ్ ప్రైవేట్ జెట్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రూ.వెయ్యి కోట్లు విలువైన ఈ విలాసవంతమైన జెట్ కలిగి ఉన్న మొదటి పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీనే. ఇప్పటికే ఆయన కలెక్షన్ లో పలు ప్రైవేట్ జెట్ లు ఉన్నాయి. అయితే.. మిగిలిన వాటితో పోలిస్తే బోయింగ్ 737 మ్యాక్స్ 9 మాత్రం ఇస్పెషల్. ఇంత ఖరీదైన విమానం ఉన్న మొట్టమొదటి పారిశ్రామికవేత్తగా ముకేశ్ సరికొత్త రికార్డును క్రియేట్ చేశారు.
ఈ ఖరీదైన జెట్ ను వాషింగ్టన్ లోని రెంటన్ లోని బోయింగ్ ఉత్పత్తి కేంద్రంలో తయారు చేశారు. నిజానికి ఈ జెట్ 2022లోనే డెలివరీ కావాల్సి ఉంది. కాకుంటే.. బోయింగ్ చుట్టూ ఉన్న వివాదాల కారణంగా డెలివరీ ఆలస్యమైంది. భారత్ కు రావటానికి ముందు ఈ విమానాన్ని బాసెల్.. జెనీవా.. లండన్ లలో విస్తృత పరీక్షల్ని నిర్వహించారు. అన్నింటిలోనూ ఇది తన సత్తాను చాటింది. ఈ ప్రైవేట్ జెట్ ప్రత్యేకత ఏమంటే.. ఒకేదఫా 11,770 కి.మీ వరకు ప్రయాణించే సత్తా దీని సొంతం. వేగంతో పాటు లగ్జరీ కలిసి కట్టుగా ఉండే ఈ విమానాన్ని ఆకాశంలో సెవెన్ స్టార్ హోటల్ గా అభివర్ణిస్తారు.
ఈ ప్రైవేటు జెట్ ను ముకేశ్ అంబానీ తమ అభిరుచికి తగ్గట్లుగా మార్పులు చేయించారు. ఈ ప్రైవేట్ జెట్ కు మరో ప్రత్యేకత ఉంది. విశాలమైన క్యాబిన్ తో పాటు పెద్ద కార్గో సామర్థ్యం దీని సొంతం. అత్యాధునిక సాంకేతికతను సొంతం చేసుకున్న దీనికి ఎంఎస్ఎన్ 8401 రిజిస్ట్రేషన్ నంబరు కలిగి ఉన్నట్లు చెబుతారు. ఇదే కాకుండా బాంబార్డియర్ గ్లోబల్ 6000, ఎంబ్రేయర్ ఈఆర్జే 135, రెండు డస్సాల్ట్ ఫాల్కన్ 900 వంటి తొమ్మిది ప్రైవేటు జెట్ లు అంబానీ వద్ద ఉన్నాయి. అంబానీనా మజాకానా?
This post was last modified on March 29, 2025 10:42 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…