ఐపీఎల్ 2025 సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆటతీరే అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ లో అలౌకికంగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లను గాలిలో కలిపేస్తున్నారు. మొదటి 4 ఓవర్లలోనే మ్యాచ్ SRH గెలిచేసినట్లే అవుతోంది. హైదరాబాద్ ఇప్పటి వరకు చేసిన అత్యధిక స్కోర్లలో నాలుగు ఈ జట్టే నమోదు చేయడంతో వారి దూకుడు ఎలా ఉందో చెప్పే ఉదాహరణ. కానీ గత సీజన్‌లో SRH బ్యాటింగ్‌పై అడ్డుకట్ట వేసిన జట్టు ఒకటుంది. అదే కోల్‌కతా నైట్ రైడర్స్.
2024లో రెండు మ్యాచ్‌ల్లోను KKR, SRH బ్యాటింగ్ ను ఆరంభంలోనే కట్టడి చేయడంలో విజయవంతమైంది. మిచెల్ స్టార్క్ ఔట్ స్వింగ్‌తో ట్రావిస్ హెడ్‌ను తొలివేళ్లలోనే పెవిలియన్‌కు పంపగా, స్పిన్నర్లతో అభిషేక్‌ను కట్టడి చేశారు. ఆ రెండు వికెట్లు పడిపోవడంతో SRH స్కోరు వేగం తగ్గింది. పైగా మిడిల్ ఆర్డర్‌లో హెన్రిచ్ క్లాసెన్ తప్ప ఒత్తిడిని తట్టుకునే ప్లేయర్ లేని నేపథ్యంలో SRH ఆ మ్యాచ్‌లు కోల్పోయింది.
ఇప్పుడు ఇదే విషయాన్ని లక్నో సూపర్ జెయింట్స్ గుర్తుంచుకోవాలి. SRHను ఆపాలంటే, మొదటి నాలుగు ఓవర్లలోనే హెడ్, అభిషేక్ వికెట్లు తీయాలి. లేదంటే వీరిద్దరూ 4 ఓవర్ల వరకు ఆడితే ఆ తరువాత జట్టు స్కోరు 250 దాటడం ఖాయం. ఇక ఆయుధంగా ఇప్పుడు ఇషన్ కిషన్ వచ్చి చేరాడు. మొదటి మ్యాచ్ లొనే అతను సెంచరీ తో షాక్ ఇచ్చాడు. ఇక ఆ తరువాత లైనప్ లో క్లాసెన్, నితీష్ కూడా ఉన్నారు. SRH బ్యాటింగ్ విషయంలో కాస్త లైట్ తీసుకున్నా LSG బ్యాటింగ్‌కు ఎలాంటి ప్రణాళికలు ఉన్నా పనికిరావు. దీంతోనే లక్నోకు కూడా ఒక పవర్ఫుల్ బౌలర్ అవసరం. ఇప్పుడు లైనప్‌లో ఉన్న శార్దూల్ ఠాకూర్, అవేష్ ఖాన్ ఈ బాధ్యతను చేపట్టాల్సిన అవసరం ఉంది.
ఇటీవల ఫామ్ లోకి వస్తున్న శార్దూల్ ఠాకూర్ కొత్త బంతితో రివర్స్ స్వింగ్ అందిస్తూ హిట్టు ప్లేయర్లను ఔట్ చేయగలిగే టాలెంట్ ఉన్నాడు. అలాగే అవేష్ ఖాన్ స్పీడ్‌ను ఉపయోగిస్తే హెడ్ దూకుడును అడ్డుకోవచ్చు. కానీ ఇందులో పంత్ కీలకం. రైట్ టైంలో స్పిన్నర్లను, వేగంగా ఉండే బౌలర్లను మార్చే ప్లాన్ బట్టి మ్యాచ్ ఫలితం మారవచ్చు. మరి SRH ఆపేందుకు LSG అస్త్రాలు ఉపయోగపడతాయా? అనేది వేచి చూడాలి.