Trends

46 ఏళ్లు జైలులోనే.. చివరికి రూ.20 కోట్ల నష్టపరిహారం!

ఎవరూ ఊహించని విధంగా న్యాయవ్యవస్థలో తలెత్తే తప్పులు ఒక్కోసారి మనిషి జీవితాన్నే చీల్చివేస్తాయి. జపాన్‌లో ఓ నిర్దోషి ఖైదీకి జరిగింది ఇదే. 1966లో జరిగిన నాలుగు హత్యల కేసులో దోషిగా తేల్చబడిన ఇవావో హకమడ (ఇప్పుడు వయసు 89) నేరమే లేని విషయంలో ఏకంగా 46 ఏళ్లు జైల్లో గడిపారు. కానీ దశాబ్దాల పోరాటం తర్వాత అతను నిర్దోషిగా బయటికి రావడంతో కోర్టు ఆయనకు రూ.20 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలంటూ సంచలన తీర్పు వెలువరించింది.

హకమడ ఒకప్పటి ప్రొఫెషనల్ బాక్సర్. ఉద్యోగ విరమణ తర్వాత ఒక సోయాబీన్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ జీవితం సాగిస్తున్న ఆయనపై 1966లో జరిగిన ఓ దారుణ హత్యకు సంబంధించి నేరం మోపారు. నలుగురిని హత్య చేసిన కేసులో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. ఆరోపణల ఆధారంగా 1968లో కోర్టు అతనికి మరణశిక్ష విధించింది. కానీ, విచారణ, శారీరక ఒత్తిడి, విచారణలో బలవంతపు ఒప్పుకోలు వంటి అంశాలన్నీ తరువాత తీవ్రమైన విమర్శలకు లోనయ్యాయి.

ఈ కేసులో సాక్ష్యాలు కల్పించబడ్డాయని, పోలీసులు రక్తంతో నానిన దుస్తులను తనవిగా ప్రదర్శించారని హకమడ తరఫు న్యాయవాదులు వాదించారు. దీన్ని గమనించిన కోర్టు 2024లో అతనిని నిర్దోషిగా ప్రకటించింది. అయితే, అతను ఇప్పటికే జీవితంలోని విలువైన భాగం కోల్పోయాడన్న వాస్తవాన్ని గుర్తించి, ప్రభుత్వం రూ.20 కోట్ల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.

నిర్దోషి వ్యక్తి జీవితాన్ని వందల కోట్లు ఇచ్చినా తిరిగి తేవలేమన్నది హకమడ జీవితంలోని ఘటన ఒక ఉదాహరణ. ఇప్పటికీ మానసిక ఒత్తిడితో బాధపడుతున్న ఆయనకు కోర్టు తీర్పు ఒక న్యాయబద్ధమైన గౌరవమే అయినప్పటికీ… చేసిన తప్పుకు శిక్ష పడడమే కాదు, చేయని నేరానికీ శిక్ష అనుభవించాలంటే ఎంత భయంకరమైనదో ఈ ఘటన ద్వారా స్పష్టమవుతుంది.

This post was last modified on March 26, 2025 10:06 pm

Share

Recent Posts

గాంధీ జయంతి ఇంత రష్ ఉందేంటి

అక్టోబర్ 2 జాతిపిత మహాత్మా గాంధీ జయంతి. నేషనల్ హాలిడే. ఆ మహానుభావుడిని ఎందరు గుర్తు చేసుకుంటారో కానీ సెలవు…

47 minutes ago

80′ s ట్రెండ్… చంద్రబాబు రూటే సెపరేటు

సామాజిక మాధ్యమాల్లో ప్రస్తుతం ‘80ల ట్రెండ్‌’ సందడి చేస్తోంది. సాధారణ ఫొటోలను కృత్రిమ మేధ సాయంతో 1980ల నాటి దుస్తులు,…

2 hours ago

AI కోసం లక్షల కోట్లు… లాభాలు రాకపోతే ఏం జరుగుతుంది?

చాట్‌జీపీటీ, జెమినీ, క్లాడ్ లాంటి AI సేవల వెనుక భారీ డేటా సెంటర్లు, ఖరీదైన చిప్స్, విద్యుత్ అవసరం ఉంటుంది.…

3 hours ago

జగన్ లోనూ ఓ కాక్రోచ్

నాలాంటి వాళ్ళే కాక్రోచ్ అవుతున్నారంటూ వైసీపీ అధినేత జగన్ చెప్పిన ఈ మాట నెట్టింట తెగ వైరల్ అవుతుంది. నీట్…

3 hours ago

వృషకర్మ… తెలివైన పని చేసిందమ్మ

ఫౌజీ విడుదల వాయిదా గురించి అసలైన మైత్రి మూవీ మేకర్స్ ఇంకా చెప్పలేదు కానీ మిగిలిన సినిమాలు అలెర్ట్ అయిపోయి…

3 hours ago

యూపీఐ లో కొత్త షార్ట్‌కట్… స్కాన్ లేకుండానే పేమెంట్

షాప్‌లో యూపీఐ పేమెంట్ చేయాలంటే ప్రస్తుతం ఫోన్‌లో యాప్ ఓపెన్ చేసి, కెమెరాతో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తున్నాం. ఇక…

5 hours ago