హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధంపై కలిగిన కోపంతో ఓ వ్యక్తి యోగా టీచర్‌ను ఏడడుగుల గోతిలో సజీవంగా పాతిపెట్టిన దారుణం చోటుచేసుకుంది. మూడు నెలలుగా అదృశ్యంగా ఉన్న జగదీప్ అనే యోగా టీచర్ మృతదేహాన్ని తాజాగా పోలీసులు వెలికితీశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం, జగదీప్ డిసెంబర్ 24న రోహ్తక్‌లోని తన ఇంటికి వెళ్లే సమయంలో కిడ్నాప్ చేశారు.
నిందితుడు ధర్మపాల్ అనే వ్యక్తి, తన మిత్రుడు హర్‌దీప్‌తో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ముందుగానే ప్లాన్ చేసిన విధంగా జగదీప్ చేతులు, కాళ్లు కట్టేసి నోటికి ప్లాస్టర్ అంటించారు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతంలో తీసుకెళ్లి, ముందే తవ్విన ఏడడుగుల గోతిలో బ్రతికుండగానే పాతిపెట్టారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే కాల్ డేటాను ఆధారంగా తీసుకుని విచారణ జరిపిన వారు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది.
వాస్తవానికి, జగదీప్ నిందితుడు ధర్మపాల్ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. అదే సమయంలో ధర్మపాల్ భార్యతో జగదీప్ అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నాడని భావించి, నిదానంగా ద్వేషం పెరిగింది. చివరికి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో జగదీప్ ప్రాణం తీశాడు. ప్లాన్ చేసుకుని, ఏడుగుల గోతిని తవ్వించి, నేరాన్ని చాలా ప్లానింగ్‌తో చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తన భార్యపై ప్రభావం చూపించాడని భావించిన ధర్మపాల్, ఇదే సరైన శిక్ష అంటూ ఏకంగా మరణం వరకూ వెళ్లాడు. ఇక ఈ కేసుకు సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి.
This post was last modified on March 26, 2025 3:02 pm
కన్నడలో ఒకప్పటి స్టార్ హీరోయిన్, తర్వాత రాజకీయ నాయకురాలిగా మారిన దివ్య స్పందన అలియాస్ రమ్య జర్నీలో వివాదాలకు లోటేమీ…
ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…
వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…
టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…
ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…
ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్తో ప్రేక్షకుల ముందుకు…