బ్రతికుండగానే ఏడడుగుల గోతిలో పాతిపెట్టాడు..

హర్యానాలోని రోహ్తక్ జిల్లాలో ఓ షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. వివాహేతర సంబంధంపై కలిగిన కోపంతో ఓ వ్యక్తి యోగా టీచర్‌ను ఏడడుగుల గోతిలో సజీవంగా పాతిపెట్టిన దారుణం చోటుచేసుకుంది. మూడు నెలలుగా అదృశ్యంగా ఉన్న జగదీప్ అనే యోగా టీచర్‌ మృతదేహాన్ని తాజాగా పోలీసులు వెలికితీశారు. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. పోలీసుల కథనం ప్రకారం, జగదీప్ డిసెంబర్ 24న రోహ్తక్‌లోని తన ఇంటికి వెళ్లే సమయంలో కిడ్నాప్‌ చేశారు.

నిందితుడు ధర్మపాల్ అనే వ్యక్తి, తన మిత్రుడు హర్‌దీప్‌తో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. ముందుగానే ప్లాన్ చేసిన విధంగా జగదీప్‌ చేతులు, కాళ్లు కట్టేసి నోటికి ప్లాస్టర్ అంటించారు. అనంతరం ఓ నిర్మానుష్య ప్రాంతంలో తీసుకెళ్లి, ముందే తవ్విన ఏడడుగుల గోతిలో బ్రతికుండగానే పాతిపెట్టారు. పోలీసులకు సమాచారం అందిన వెంటనే కాల్‌ డేటాను ఆధారంగా తీసుకుని విచారణ జరిపిన వారు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా ఈ భయానక ఘటన వెలుగులోకి వచ్చింది.

వాస్తవానికి, జగదీప్ నిందితుడు ధర్మపాల్‌ ఇంట్లో అద్దెకు ఉండేవాడు. అదే సమయంలో ధర్మపాల్ భార్యతో జగదీప్‌ అనుమానాస్పదంగా ప్రవర్తిస్తున్నాడని భావించి, నిదానంగా ద్వేషం పెరిగింది. చివరికి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్నాడనే అనుమానంతో జగదీప్‌ ప్రాణం తీశాడు. ప్లాన్ చేసుకుని, ఏడుగుల గోతిని తవ్వించి, నేరాన్ని చాలా ప్లానింగ్‌తో చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. తన భార్యపై ప్రభావం చూపించాడని భావించిన ధర్మపాల్, ఇదే సరైన శిక్ష అంటూ ఏకంగా మరణం వరకూ వెళ్లాడు. ఇక ఈ కేసుకు సంబంధించి కోర్టు ఎలాంటి తీర్పును ఇస్తుందో చూడాలి.