తమీమ్ ఇక్బాల్.. అంతర్జాతీయ క్రికెట్ ను ఫాలో అయ్యేవారికి పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు. ఈ సీనియర్ క్రికెటర్ ప్రస్తుతం ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నాడు. అతడి పరిస్థితి అత్యంత విషమంగా ఉంది. 36 ఏళ్ల తమీమ్.. సోమవారం ఢాకా ప్రిమియర్ లీగ్‌లో భాగంగా మ్యాచ్ సందర్భంగా గుండె పోటుకు గురయ్యాడు. మ్యాచ్ ఆరంభానికి ముందు టాస్ వేయడానికి కెప్టెన్‌గా మైదానంలోకి వచ్చాడు తమీమ్. ఉన్నట్లుండి అతడికి ఛాతీలో నొప్పి రావడంతో వెంటనే సమీపంలోని ఓ ఆసుపత్రికి తరలించారు. స్వల్పంగా గుండె పోటు వచ్చినట్లు వైద్యులు గుర్తించడంతో అక్కడ్నుంచి అత్యవసరంగా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు హెలికాఫ్టర్ తెప్పించారు. కానీ హెలిప్యాడ్‌కు వెళ్తుండగానే మరోసారి తమీమ్‌కు గుండెపోటు వచ్చింది. ఈసారి హార్ట్ ఎటాక్ తీవ్ర స్థాయిలో రావడంతో తన పరిస్థితి విషమించింది.
ప్రస్తుతం తమీమ్ పరిస్థితి విషమంగానే ఉందని.. వెంటిలేటర్ మీద చికిత్స అందిస్తున్నారని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు ప్రకటించింది. తమీమ్‌కు చికిత్స అందిస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తమీమ్ పేరు చెప్పగానే భారత క్రికెట్ అభిమానులకు 2007 వన్డే ప్రపంచకప్ గుర్తుకు వస్తుంది. ఆ టోర్నీలో బంగ్లాదేశ్ సంచలన విజయంతో భారత్‌ను ఇంటిముఖం పట్టించడంలో తమీమ్ పాత్ర కీలకం.
అప్పటికి తన వయసు 18 ఏళ్లే. ఆ తర్వాత తమీమ్ బంగ్లాదేశ్ జట్టులో కీలక ఆటగాడిగా ఎదిగాడు. ఓపెనర్ అయిన తమీమ్ కొంత కాలం బంగ్లాదేశ్‌కు కెప్టెన్‌గా కూడా పని చేశాడు. మూడు ఫార్మాట్లలో కీలక ఆటగాడిగా ఉన్న తమీమ్.. ఈ ఏడాది జనవరిలోనే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. అతను 70 టెస్టులు, 243 వన్డేలు, 78 టెస్టుల్లో బంగ్లాదేశ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. తమీమ్ కోలుకోవాలని ప్రపంచవ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
This post was last modified on March 24, 2025 4:24 pm
ఐపీఎల్ 2025 సీజన్ ఓ అద్భుతమైన మ్యాచ్‌తో ప్రారంభమైందనుకునేలోపే, సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది చెన్నై – ముంబై…
సినిమాల్లో అనుకున్నంతగా సక్సెస్ కాకపోయినా సోషల్ మీడియాలో సూపర్ పాపులారిటీ ఉన్న అందాల భామల్లో మాళవిక మోహనన్ ఒకరు. ఉత్తరాదికి దిశా పటాని…
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి సోమవారం సాయంత్రం దేశ రాజధాని డిల్లీ చేరుకున్నారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి…
తమిళ స్టార్ హీరో విజయ్ చివరి సినిమాగా నిర్మాణంలో ఉన్న జన నాయగన్ విడుదల తేదీ వచ్చేసింది. 2026 జనవరి…
ఈ వారం విడుదల కాబోతున్న ఎల్2 ఎంపురాన్ మొదటి భాగం లూసిఫర్ ని తెలుగు ప్రేక్షకులు ఓటిటిలో భారీగానే చూశారు.…
ఏపీ గిరి పుత్రులు పండిస్తున్న సేంద్రీయ అరకు కాఫీ రుచులు విశ్వవ్యాప్తంగా విస్తరించాలన్న టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా…