ఉత్తరప్రదేశ్‌లోని మేరఠ్‌లో ఓ దారుణమైన ఘటన వెలుగుచూసింది. మర్చంట్ నేవీ అధికారి సౌరభ్ రాజ్‌పుత్‌ను అతని భార్య ముస్కాన్, ఆమె ప్రియుడు కలిసి హత్య చేసిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న సౌరభ్ తన కుమార్తె పుట్టినరోజు కోసం లండన్ నుంచి ఇండియాకు రావడంతో భార్యకు అసహనంగా మారాడు. ప్రేమలో మోసం చేసిన ముస్కాన్ ఈ హత్యను పథకం ప్రకారం అమలు చేసి, భర్తను 15 ముక్కలుగా నరికి డ్రమ్ములో దాచిపెట్టింది. ఈ అమానుష చర్య చివరకు ఓ చిన్నారి మాటలతో బయటపడింది.
సౌరభ్ హత్య అనంతరం ముస్కాన్ ప్రియుడితో కలిసి ట్రిప్ వెళ్లిపోయింది. తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో మరమ్మతులు చేయించేందుకు ఇంటి యజమాని కూలీలను పంపించాడు. కూలీలు డ్రమ్మును కదిలించడానికి ప్రయత్నించగా అది చాలా బరువుగా ఉందని గమనించారు. దీంతో లోపల ఏముందని అడగగా, చెత్తాచెదారం ఉందని ముస్కాన్ చెప్పింది. అయితే మూత తీసి చూడగా అసహనకరమైన దుర్వాసన రావడంతో అనుమానాలతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన మరింత భయానకంగా మారినది.
ఈ హత్యను గుర్తించడంలో సౌరభ్ ఆరేళ్ల కుమార్తె కీలకంగా మారింది. తన తండ్రి డ్రమ్ములో ఉన్నాడని చిన్నారి పొరుగింటి వారికి పదేపదే చెప్పడం గమనించిన ముస్కాన్ తన కుమార్తెను వెంటనే వేరే చోటుకు పంపించేసింది. అయితే, ఇది ఆమె తప్పించుకునేందుకు చేసిన ప్రయత్నమే తప్ప, చివరకు వాస్తవం బయటపడకుండా ఆపలేకపోయింది. ముస్కాన్ హత్య నిజం బయటకు వచ్చిన తరువాత తన తల్లిదండ్రుల వద్దకు వెళ్లి అన్ని వివరాలు చెప్పడంతో వారు షాక్‌కు గురయ్యారు. వెంటనే ఆమెను పోలీసులకు అప్పగించారు.
తమ కూతురి నేరానికి తీవ్రంగా స్పందించిన ముస్కాన్ తల్లిదండ్రులు, నిందితురాలికి ఉరిశిక్ష విధించాలని కోరడం గమనార్హం. ఈ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఈ కేసును పరిశీలించిన పోలీసులు ముస్కాన్‌ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై సౌరభ్ తల్లి రేణు దేవీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తన కుమారుడిని ఎంతో ప్రేమగా పెంచి, అతని భవిష్యత్తును సాకారం చేసేందుకు పంపించామని, కానీ ఇలాంటి దారుణమైన హత్య జరుగుతుందని ఊహించలేదని ఆమె కన్నీరుమున్నీరయ్యారు. హత్య చేసిన తన కోడలు, ఆమె ప్రియుడికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
This post was last modified on March 20, 2025 1:11 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…