Trends

చాహల్ ఆమెకిస్తోంది 4.75 కోట్లేనా?

ఇండియన్ క్రికెట్లో మీడియా దృష్టిని బాగా ఆకర్షించిన జంటల్లో ఒకటనదగ్గ యుజ్వేంద్ర చాహల్-ధనశ్రీ విడిపోవడం ఇటీవల చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. వీళ్లిద్దరూ విడిపోతున్నట్లు ఏడాది కిందటే వార్తలు మొదలయ్యాయి. ఇప్పుడు అది అధికారికం అయింది. దాదాపు 18 నెలలుగా విడిగా ఉంటున్న ఈ జంట.. గత ఏడాది విడాకుల కోసం దరఖాస్తు చేయగా.. కోర్టు తాజాగా వారికి విడాకులు మంజూరు చేసినట్లు వార్తలొచ్చాయి. ఐతే చాహల్ నుంచి విడిపోతూ ధనశ్రీ అతడి నుంచి భారీ మొత్తంలో భరణం తీసుకుంటున్నట్లు ఇటు మీడియాలో, అటు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే.

ఆ మొత్తం ఏకంగా రూ.60 కోట్లు అని వార్తలు వచ్చాయి. ఈ సమాచారం బయటికి రాగానే ధనశ్రీని గోల్డ్ డిగ్గర్ అంటూ నెటిజన్లు ట్రోల్ చేశారు. ఐతే ఈ ప్రచారాన్ని కొన్ని రోజుల కిందటే ధనశ్రీ కుటుంబం ఖండించింది. ఐతే వాస్తవానికి చాహల్ నుంచి ధనశ్రీ ఎంత మొత్తం భరణం రూపంలో తీసుకుంటున్నది ఇప్పుడు అధికారికంగా వెల్లడైంది. వీరికి విడాకులు మంజూరు చేసిన ఫ్యామిలీ కోర్టు భరణం గురించి కూడా ఆదేశాలు చేసినట్లు వెల్లడైంది. ధనశ్రీకి రూ.4.75 కోట్లు ఇవ్వాలని చాహల్‌కు కోర్టు ఆదేశాలు జారీ చేసినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి.

అందులో భాగంగా చాహుల్ ఆల్రెడీ రూ.2.37 కోట్లు చెల్లించాడట. ఇదిలా ఉండగా విడాకులు మంజూరు చేస్తూనే.. దీనిపై పునరాలోచించుకునేందుకు ఆరు నెలల కూలింగ్ పీరియడ్‌ను చాహల్, ధనశ్రీ జంటకు కోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ పరస్పర అంగీకారంతోనే విడాకులు తీసుకోవడానికి సిద్ధమైన నేపథ్యంలో కూలింగ్ పీరియడ్‌ను మినహాయించాలాని చాహల్ కోరినట్లు సమాచారం. ఐతే ఇంకా పూర్తి భరణం చెల్లించని నేపథ్యంలో చాహల్ అభ్యర్థనను కోర్టు తిరస్కరించిందట. ఈ నేపథ్యంలో మొత్తం భరణం చెల్లించి వ్యవహారాన్ని సెటిల్ చేసుకోవాలని చాహల్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.

This post was last modified on March 19, 2025 6:58 pm

Share

Recent Posts

బిర్యానీ తినడానికే పుట్టినవారు జంతువులు

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…

4 minutes ago

ఆరుగురు పతివ్రతలు మళ్ళీ వస్తున్నారు

కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా న‌డుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…

11 minutes ago

డెకాయిట్ అత్యాశని దృశ్యం 3 వాడుకుంది

బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…

1 hour ago

బీజేపీ మంత్రి ఇలాకాలో మారుతున్న రాజ‌కీయం ..!

ఉమ్మ‌డి అనంతపురం జిల్లాలోని ధ‌ర్మ‌వ‌రం నియోజ‌క‌వ‌ర్గం ఒక్క‌సారిగా రాజ‌కీయ చ‌ర్చ‌కు వేదిక‌గా మారింది. ప్ర‌స్తుతం ఈ నియోజ‌క‌వ‌ర్గం నుంచి మంత్రి…

3 hours ago

ఫ్లైయింగ్ అతడికి భార్యలాంటిది

ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…

5 hours ago

ఆ యంగ్ మినిస్ట‌ర్ దూకుడు మామూలుగా లేదుగా…

యువ మంత్రి, క‌ర్నూలు జిల్లాకు చెందిన టీజీ భ‌ర‌త్‌.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయ‌కుడిగా.. యువ…

7 hours ago