ఐపీఎల్ వ్యవస్థాపకుడు లలిత్ మోడీకి కొత్త చిక్కులు ఎదురవుతున్నాయి. తాజాగా వనౌటు ప్రభుత్వం అతనికి మంజూరైన పాస్‌పోర్టును రద్దు చేయాలని నిర్ణయించింది. దేశపౌరసత్వాన్ని కేవలం నిర్భందం తప్పించుకోవడానికి ఉపయోగించుకోవడం సరైన కారణం కాదని వనౌటు ప్రధాన మంత్రి జోథమ్ నపాట్ స్పష్టంచేశారు. ఈ నిర్ణయం లలిత్ మోడీకి తీవ్రమైన ఎదురుదెబ్బగా మారింది. ఇప్పటికే ఆయన భారత హైకమిషన్‌కు తన పాస్‌పోర్టును అప్పగించాలని దరఖాస్తు చేసుకున్నారు.
వనౌటు ప్రభుత్వం తాజాగా ఇచ్చిన ప్రకటన ప్రకారం, లలిత్ మోడీ పౌరసత్వాన్ని రద్దు చేయడానికి కీలక కారణం ఇంటర్‌పోల్‌తో సంబంధం కలిగి ఉంది. మోడీపై భారత ప్రభుత్వం పెట్టిన రెడ్ నోటీసును ఇంటర్‌పోల్ రెండు సార్లు తిరస్కరించిందని వనౌటు ప్రభుత్వం వెల్లడించింది. క్రిమినల్ కడవిక్షణలో అతనిపై సరైన న్యాయ ఆధారాలు లేవని ఇంటర్‌పోల్ పేర్కొంది. అయితే, పౌరసత్వాన్ని పొందడంలో మోడీ అసలు ఉద్దేశం తనపై ఉన్న కేసుల నుంచి తప్పించుకోవడమేనని తాజా ఆధారాలు తేల్చాయని వనౌటు ప్రధాని తెలిపారు.
వనౌటు పౌరసత్వాన్ని సంపాదించడానికి మోడీ పెట్టుబడిదారుల పథకాన్ని ఉపయోగించుకున్నారని, కానీ ఈ పథకం కఠిన నియమాలకు లోబడి పనిచేస్తుందని వనౌటు ప్రభుత్వం స్పష్టంచేసింది. గత నాలుగేళ్లలో ప్రభుత్వం తన పౌరసత్వ విధానాన్ని మరింత కఠినతరం చేసిందని, అనుమానాస్పదమైన అభ్యర్థులను నిరాకరిస్తున్నట్లు వెల్లడించింది. పౌరసత్వం పొందేందుకు నేర చరిత్ర లేని వారి పేరును మాత్రమే అనుమతించే విధానం అమల్లో ఉందని తెలిపింది.
భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం, లలిత్ మోడీ తన పాస్‌పోర్టును వదులుకోవాలని దరఖాస్తు చేసుకున్నాడు. కానీ, ఆయనపై ఉన్న కేసులను వదిలిపెట్టేది లేదని భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. వనౌటు పౌరసత్వం రద్దు అయితే, మోడీ మరల భారత ప్రభుత్వ విచారణకు దొరకడం తథ్యం. భారత న్యాయవ్యవస్థ ఇప్పటికీ లలిత్ మోడీపై దర్యాప్తును కొనసాగిస్తూనే ఉంది.
2010లో భారత్ విడిచి వెళ్లిన లలిత్ మోడీపై కోట్లాది రూపాయల అవినీతి ఆరోపణలున్నాయి. ఆయన భారత చట్టాలను దాటి తక్షణ అగ్రిమెంట్లు పొందడానికి ప్రయత్నిస్తున్నారన్న వాదనలతో వనౌటు చర్య తీసుకుంది. ఇప్పుడు ఈ నిర్ణయం తర్వాత మోడీ తదుపరి దారి ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది. భారత్‌కు తిరిగి రావడం తప్పనిసరి అవుతుందా లేక మరో దేశం ద్వారా ఆయన తప్పించుకునే ప్రయత్నం చేయనున్నారా? అన్న ప్రశ్నలపై త్వరలో క్లారిటీ రానుంది.