ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను ఓడించి టీమిండియా ఘన విజయం సాధించినా, మ్యాచ్‌కు సమానంగా మరో అంశం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. భారత స్పిన్నర్ యజువేంద్ర చాహల్ స్టేడియంలో ఓ మిస్టరీ గర్ల్‌తో కనిపించడం నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది. భారత జట్టు చరిత్ర సృష్టించిన ఈ విజయ వేళ, గెలుపును ఆస్వాదించేందుకు డుబాయ్ స్టేడియానికి వచ్చిన చాహల్, ప్రముఖ రేడియో జాకీ మహ్వష్‌తో కూర్చుని కనిపించాడు.
ఈ పరిణామం చాహల్ వ్యక్తిగత జీవితం చుట్టూ ఇప్పటికే జరుగుతున్న ఊహాగానాలకు మరింత ఊతమిచ్చింది. అతని భార్య ధనశ్రీ వర్మతో విడాకుల వ్యవహారం మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. కొన్నిసార్లు గాసిప్‌గా కనిపించిన ఈ వార్తలు గత వారం అధికారికంగా ధృవీకరించబడ్డాయి. ఇద్దరూ బాంద్రా ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం ఫైనల్ హియరింగ్‌కు హాజరైనట్లు సమాచారం. అయితే ధనశ్రీ న్యాయవాది మాత్రం కేసు ఇంకా విచారణలో ఉందని స్పష్టం చేసింది.
ఈ వ్యవహారంలో మరో కీలక అంశం ధనశ్రీ రూ.60 కోట్ల అలిమనీ డిమాండ్ చేసిందన్న వార్తలు. అయితే ఆమె కుటుంబ సభ్యులు ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తూ, అవి పూర్తిగా అవాస్తవమని ప్రకటించారు. “ఎలాంటి పెద్ద మొత్తాన్ని డిమాండ్ చేయలేదు, ఈ రూమర్ల వల్ల ఇరువురి కుటుంబాలు అనవసరమైన ఒత్తిడికి గురవుతున్నాయి” అని ధనశ్రీ కుటుంబ సభ్యులు ఓ ప్రకటనలో స్పష్టం చేశారు. మీడియాలో వస్తున్న ఈ రకమైన నిరాధార వార్తలు బాధితులకు నష్టం కలిగించవచ్చని పేర్కొన్నారు.
ఒకవైపు వ్యక్తిగత జీవితంలో గందరగోళ పరిస్థితులు, మరోవైపు భారత క్రికెట్ జట్టు విజయోత్సవంలో పాల్గొన్న చాహల్, అందమైన అమ్మాయితో కనిపించడం ఫ్యాన్స్‌లో చర్చలకు దారి తీసింది. సోషల్ మీడియాలో “ఈమె ఎవరు?” అన్న ప్రశ్నలు పెరిగిపోతున్నాయి. అయితే మహ్వష్ రేడియో రంగంలో మంచి గుర్తింపు పొందిన వ్యక్తి కాగా, చాహల్‌తో ఆమె సంబంధాన్ని స్పష్టంగా ఎవరూ వెల్లడించలేదు. మరి చాహల్ ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.
This post was last modified on March 10, 2025 5:09 am
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్‌గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…
సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…