టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మపై కాంగ్రెస్ నేత శమా మహమ్మద్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీశాయి. లావుగా ఉన్నాడంటూ ఆమె చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారాన్ని రేపింది. ఈ వ్యాఖ్యలు కేవలం అభిమానులను మాత్రమే కాదు, భారత క్రికెట్ బోర్డును కూడా తీవ్ర అసహనానికి గురిచేశాయి. ఐసీసీ టోర్నీ మధ్యలో ఉన్న సమయంలో ఇలాంటి అనవసర వ్యాఖ్యలు అవసరమా అని కౌంటర్లు వస్తున్నాయి.
ఈ వివాదంపై తాజాగా బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా స్పందిస్తూ, ఇటువంటి వ్యాఖ్యలు మానుకోవాలని స్పష్టంగా అన్నారు. “ఈ తరహా వ్యక్తిగత విమర్శలు ఆటగాళ్ల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీస్తాయి. జట్టు ఒక కీలక టోర్నీలో పోటీ పడుతున్న తరుణంలో, బాధ్యతాయుతమైన వ్యక్తుల నుంచి ఇలాంటి మాటలు రావడం అసహనకరం” అని ఆయన వ్యాఖ్యానించారు. దీనితో రోహిత్‌కి మద్దతుగా క్రికెట్ వర్గాలు, అభిమానులు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున స్పందిస్తున్నారు.
కానీ శమా మహమ్మద్ మాత్రం తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నం చేశారు. “క్రీడాకారులు ఫిట్‌గా ఉండాలి అనే ఉద్దేశ్యంతోనే నేను పోస్ట్ లో అలా రాశాను. ఇది బాడీ షేమింగ్ కాదు” అని వివరణ ఇచ్చారు. అయితే ఆమె చేసిన వ్యాఖ్యలు క్రీడా ప్రపంచానికే కాదు, రాజకీయ వర్గాలకు కూడా చర్చనీయాంశంగా మారాయి. కాంగ్రెస్ పార్టీ దీనిపై స్పందిస్తూ, తమకు ఈ వ్యాఖ్యలతో ఎలాంటి సంబంధం లేదని పేర్కొంది.
ఇదంతా జరుగుతుండగా, టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ మరో సంచలన వ్యాఖ్య చేసి నూతన వివాదానికి తెరతీశారు. “రోహిత్ జట్టులో కూడా ఉండకూడదు” అంటూ ఆమె చేసిన కామెంట్స్ మద్దతుగా వ్యాఖ్యానించడంతో, ఈ వివాదం మరింత ముదిరింది. మొత్తానికి, ఈ వ్యాఖ్యలు పొలిటికల్ గా కాంగ్రెస్ కు కొంత డ్యామేజ్ తీసుకు వచ్చే ప్రమాదం ఉంది. మరి ఆ పార్టీ అధిష్టానం ఇంకా ఏమైనా క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.
This post was last modified on March 3, 2025 4:56 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…