ప్రపంచంలో మరే దేశంలో ఉండని భిన్నత్వంలో ఏకత్వం భారత్ లోనే ఉంటుంది. నిజమే.. కొన్ని అభిప్రాయ బేధాలు ఉండొచ్చు. అయినప్పటికీ మతసామరస్యంలో మాత్రం మనకు మించినోళ్లు లేరన్న భావన కలుగక మానదు. హిందూ.. ముస్లిం అంటూ బేధాభిప్రాయాలని క్రియేట్ చేసే వారికి భిన్నంగామతాలకు అతీతంగా ప్రేమాభిమానాలే ప్రాణవాయువులుగా తపించే వారు ఉంటారు. తాజాగా అదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో చోటు చేసుకున్న ఒక ఉదంతం గురించి తెలిస్తే వావ్ అనకుండా ఉండలేరు.
ఉట్నూర్ మండలంలోని శ్యాంపూర్ గ్రామానికి చెందిన షేక్ సలీం ఉపాధి కోసం ముప్ఫై ఏళ్ల క్రితం హైదాబాద్ కు వెళ్లిపోయారు. ఆ మహానగరంలోని ఒక ఆసుపత్రితో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. కానీ.. తన ఊళ్లో మాత్రం తరచూ ఏదో ఒక సామాజిక సేవా కార్యక్రమాల్ని చేపడుతుండేవారు. అంతేనా.. ఊళ్లో ఎవరైనా అనారోగ్యానికి గురైతే.. వారిని హైదరాబాద్ కు తీసుకొచ్చి.. అన్నీ తానై చూసుకొని.. వారిని ఆరోగ్య వంతులుగా చేసి ఊరికి పంపేవాడు.
ఇటీవల సలీంకు బ్రెయిన్ ట్యూమర్ బారిన పడ్డాడు. ప్రస్తుతం అతను ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు. దీంతో.. అతడి కోసం ఊళ్లోని హిందువులంతా అతనికి స్వస్థత చేకూరాలని.. ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో స్థానిక ఆంజనేయస్వామి దేవాలయంలో యజ్ఞం చేపట్టారు. తమ సలీంను కాపాడాలి భగవంతుడా అని వేడుకుంటున్నారు. ఇదంతా చదివిన తర్వాత అర్థమవుతుందా.. మన దేశం ప్రత్యేకత ఏమిటో?
This post was last modified on March 2, 2025 10:28 am
థాయ్‌లాండ్ రాణి సుతిదా ఇప్పుడు యుద్ధ విమానం నడిపి అందరినీ ఆశ్చర్యపరిచారు. 48 ఏళ్ల వయసులో గ్రిపెన్ ఫైటర్ జెట్‌ను…
కడుపున పుట్టిన బిడ్డకు వైద్యం చేయించేందుకు డబ్బులు లేక ఓ తల్లి చేసిన పని కలచివేస్తోంది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆరేళ్ల…
యెమెన్ అంతర్గత యుద్ధం నేపథ్యంలో అక్కడి ప్రభుత్వ దళాలకు సౌదీ అరేబియా మద్దతునిస్తోంది. మరోవైపు, యెమెన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాడులు…
భారత్‌లో స్టార్‌లింక్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్ ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే. అయితే మస్క్ సొంత AI చాట్‌బాట్ గ్రోక్…
తమిళ బిగ్‌బాస్ ఎనిమిదో సీజన్ విజేత ముత్తుకుమరన్ వివాదంలో చిక్కుకున్నారు. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న వహిదా అక్దర్…
సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలయికలో తెరకెక్కుతున్న జైలర్ 2 అక్టోబర్ పదిహేను విడుదలవుతున్న సంగతి…