Trends

పిల్లల సాక్ష్యం పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు!

న్యాయపరంగా పిల్లల సాక్ష్యం ఎంత వరకు నమ్మదగినదో అనే అంశంపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మధ్యప్రదేశ్‌లో జరిగిన హత్య కేసులో ఏడేళ్ల బాలిక ఇచ్చిన సాక్ష్యాన్ని న్యాయస్థానం ప్రామాణికంగా గుర్తించి, నిందితుడికి జీవితఖైదు విధించింది. ఈ కేసులో ముద్దాయి తన భార్యను హత్య చేసినప్పుడు చిన్నారి అక్కడే ఉండగా, ఆమె చెప్పిన వివరాలను తొలుత హైకోర్టు తోసిపుచ్చింది. కానీ సుప్రీంకోర్టు మాత్రం చిన్నారి వాఖ్యలను పరిగణనలోకి తీసుకుని హైకోర్టు తీర్పును రద్దు చేసింది.

సాక్ష్య చట్టంలో వయస్సుకు పరిమితి లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. పిల్లల ద్వారా వచ్చిన సాక్ష్యాన్ని నేరుగా తిరస్కరించలేమని న్యాయమూర్తులు తెలిపారు. అయితే, పిల్లలు ప్రభావితమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండటంతో, కోర్టులు అత్యంత జాగ్రత్తగా అటువంటి సాక్ష్యాన్ని పరిశీలించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. చిన్నారులు ఇతరుల ప్రభావానికి గురయ్యే అవకాశం ఉన్నప్పటికీ, అందుకు తగిన ఆధారాలు లేకుంటే వారి వాఖ్యాలను పూర్తిగా తిరస్కరించకూడదని న్యాయస్థానం తేల్చి చెప్పింది.

చిన్నారి ఇచ్చిన వాఖ్యాలు సహజమైనవా? లేక ఎదుటివారి ప్రభావం వల్ల చెప్పించబడ్డాయా? అనే అంశాన్ని కోర్టులు వివరంగా పరిశీలించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. పిల్లల సాక్ష్యం అంతుచిక్కని సమస్యగా మారితే, కోర్టులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. పిల్లల ద్వారా వచ్చిన సాక్ష్యానికి తప్పనిసరిగా మరో వ్యక్తి మద్దతుగా ఉండాలని నిబంధన లేదని, కానీ అవసరమైన సందర్భాల్లో అదనపు రుజువులను పరిశీలించడం మంచిదని న్యాయస్థానం వ్యాఖ్యానించింది.

మొత్తానికి, పిల్లలు న్యాయపరంగా సాక్ష్యంగా నిలబడే అంశాన్ని సుప్రీంకోర్టు స్పష్టంగా సమర్థించింది. కానీ, కోర్టులు ఆ సాక్ష్యాన్ని అర్ధం చేసుకోవడంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. చిన్నారులను ప్రభావితం చేయకుండా, వారి వాఖ్యాలు నిజాయితీగా ఉన్నాయా? లేదా? అనే అంశాన్ని నిశితంగా పరిశీలించాలని తేల్చి చెప్పింది. ఈ తీర్పు, భవిష్యత్‌లో చిన్నారుల సాక్ష్యంపై కోర్టుల వైఖరికి స్పష్టతనిస్తుంది.

This post was last modified on February 26, 2025 3:03 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

పరకామణి చోరీ పై హైకోర్టు సంచలన వ్యాఖ్యలు

వైసీపీ పాల‌నా కాలంలో తిరుమ‌ల శ్రీవారి ప‌ర‌కామ‌ణిలో 900 డాల‌ర్ల  చోరీ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ ప‌రిణామం తిరుమ‌ల…

2 hours ago

వారిని సెంటర్లో పడేసి కొట్టమంటున్న టీడీపీ ఎమ్మెల్యే!

నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…

3 hours ago

రేట్లు లేకపోయినా రాజాసాబ్ లాగుతాడా?

ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…

5 hours ago

అడిగిన వెంటనే ట్రైనీ కానిస్టేబుళ్లకు 3 రెట్లు పెంపు

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్‌లో 5,757…

9 hours ago

గంటలో ఆర్డర్స్… ఇదెక్కడి స్పీడు పవన్ సారూ!

అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…

10 hours ago