కన్నప్ప వల్ల మంచు ఫ్యామిలీ, ప్రభాస్ మధ్య ఎంత స్నేహం ఉందో బయట ప్రపంచానికి తెలిసింది. ఒక్క రూపాయి పారితోషికం తీసుకోకుండా డార్లింగ్ అందులో ఫ్రీగా క్యామియో చేయడం చూస్తే బంధం ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. కన్నప్ప బిజినెస్ లో ప్రభాస్ పాత్ర కీలక పాత్ర పోషించబోవడం ఎవరూ కాదనలేరు.
ముఖ్యంగా ఉత్తరాది మార్కెట్ కి ఇది చాలా కీలకం కానుంది. అయితే క్యారెక్టర్ తాలూకు తీరుతెన్నులు వగైరా ప్రస్తుతానికి సస్పెన్స్ లో ఉంచారు. శివుడిగా అక్షయ్ కుమార్ చేస్తున్నాడు కాబట్టి ప్రభాస్ బసవనా లేక ఇంకేదైనా సర్ప్రైజ్ ఉంటుందానేది ఇంకొంత కాలం వేచి చూడాలి.
ఇదిలా ఉండగా స్పిరిట్ కోసం ఇటీవలే క్యాస్టింగ్ కాల్ ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. ఆడామగా అన్ని వయసుల వారు అప్లై చేసుకోవచ్చని, రెండు నిమిషాల వీడియోతో పాటు ఫోటోలు ఇతర వివరాలు పంపిస్తే ఆడిషన్ కి ఎంపిక చేస్తామని భద్రకాళి పిక్చర్స్ సోషల్ మీడియా వేదికగా పేర్కొంది.
ఇప్పటికే కొన్ని వేలు లక్షల మెయిల్స్ వచ్చి ఉంటాయి కానీ ఇప్పుడీ లిస్టులో సెలబ్రిటీలు కూడా చేరుతున్నారు. మంచు విష్ణు అఫీషియల్ గా దీని గురించి చెబుతూ నేను కూడా అప్లికేషన్ పెట్టుకున్నానని, చూద్దాం ఏం జరుగుతుందోనంటూ ఎక్స్ వేదికగా ప్రకటించాడు.
సందీప్ వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ది రాజా సాబ్, ఫౌజీ పూర్తయ్యాక దీని సెట్లలో ప్రభాస్ అడుగు పెట్టబోతున్నాడు. వయొలెంట్ పోలీస్ ఆఫీసర్ గా ఇప్పటిదాకా ఎవరూ చూపించని యాంగిల్ లో ఖాకీ పవర్ ని ఇందులో ఆవిష్కరిస్తారట.
అయినా మంచు విష్ణు నేరుగా అడిగినా అవకాశం వచ్చేస్తుంది కానీ అక్కడ ఉన్నది వంగా కాబట్టి ప్రతిదీ ప్రక్రియని బట్టి జరగాలేమో. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం సమకూరుస్తున్న స్పిరిట్ కి ఇంకా హీరోయిన్ ని లాక్ చేయలేదు. ప్రస్తుతం సందీప్ వంగా ఎంపిక మీద కసరత్తు చేస్తున్నాడు. త్వరలోనే ఫైనల్ చేయబోతున్నారు.
This post was last modified on February 15, 2025 3:14 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…