Trends

ఇది కొత్త రకం డ్రైవింగ్!… ల్యాప్ టాప్ డ్రైవింగ్ అంటారు!

ట్రాఫిక్ రూల్స్, రోడ్డు భద్రత, సేఫ్ డ్రైవింగ్.. తదితరాలపై జనాన్ని ఎడ్యుకేట్ చేయడంలో తెలంగాణ ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ గా ఉన్న సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జన్నార్ ఎప్పుడూ ఆసక్తిగానే ఉంటారు. ఈ విషయంలో ఆయన అందరికంటే కూడా ముందు ఉంటారని చెప్పక తప్పదు.

సేఫ్ డ్రైవింగ్ ను ఎంతగా ప్రోత్సహిస్తారో…జాగ్రత్త లేని, ఇతరుల ప్రాణాలకు ముప్పుగా పరిణమించే డేంజరస్ డ్రైవింగ్ అంతే స్థాయిలో ఆయన విరుచుకుపడతారు. అలాంటి ఘటనే ఒకటి గురువారం చోటుచేసుకుంది.

గురువారం ట్విట్టర్ లో ఓ వీడియోను పోస్ట్ చేసిన సజ్జన్నార్…అందులో ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తున్న యువతి చేస్తున్న డేంజరస్ డ్రైవింగ్ గురించి తనదైన స్టైల్లో గడ్డి పెట్టారు. ”ఇది సెల్ ఫోన్ డ్రైవింగ్ కాదు. అంతకుమించిన ల్యాప్ టాప్ డ్రైవింగ్. మనుషులు మరీ ఇంత బిజీనా? ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ కారు నడిపే ఫ్రీ టైం కూడా లేదా? వర్క్ ఫ్రం హోమ్ అంటే… కారు నడుపుతూ పనిచేయడం కాదు కదా.

మల్టీ టాస్కింగ్ నైపుణ్యాలను వేరే పనులకు ఉపయోగించుకోండి. ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు కాదు. ఉన్నత విద్యను అభ్యసించి మంచి కొలువులు చేసేవాళ్లే యథేచ్ఛగా రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ పై నలుగురికి అవగాహన కల్పించాల్సిన వాళ్లే… తమకేం పట్టనట్లుగా ఇలా వ్యవహరిస్తుండటం బాధాకరం. ఈ ఘటన ఇటీవల బెంగళూరు నగరంలో జరిగింది” అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సజ్జన్నార్ పోస్ట్ చేసిన వీడియోలో ఓ మహిళ తన ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని కారును డ్రైవ్ చేస్తున్నారు. సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కనిపిస్తున్న సదరు యువతి ఓ చేతితో స్టీరింగ్ తిప్పుతూ…మరో చేతితో ల్యాప్ టాప్ ను హ్యాండిల్ చేస్తూ సాగుతున్నారు. బెంగళూరులో అసలే హెవీ ట్రాఫిక్ ఉంటున్న సంగతి తెలిసిందే.

అలాంటి ట్రాఫిక్ లో కూడా ఇలా ఎంచక్కా ల్యాప్ టాప్ ను ఒడిలో పెట్టుకుని సదరు యువతి డ్రైవింగ్ చేస్తున్న తీరును చూస్తుంటే.. నిజంగానే భయం వేస్తోంది. ఈ యువతి చేతిలోని కారు ఏమాత్రం అదుపు తప్పినా… పెను ప్రమాదం ఖాయమే కదా. అందుకే.. సజ్జన్నార్ ఆవేదనలో అర్థముందని చెప్పక తప్పదు.

This post was last modified on February 13, 2025 7:31 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

వీరమల్లుకున్న ఇరకాటం అదొక్కటే

షూటింగ్ అయిపోయింది ఇంకే టెన్షన్ లేదని హరిహర వీరమల్లు వెంటనే రిలాక్స్ అవ్వడానికి లేదు. ఎందుకంటే అసలైన సవాల్ విడుదల…

46 minutes ago

జ‌నార్ద‌న్‌రెడ్డి అంత ఈజీగా దొర‌కలేదు: జేడీ ల‌క్ష్మీనారాయ‌ణ‌

ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అధిప‌తి, మాజీ మంత్రి గాలి జ‌నార్ద‌న్‌రెడ్డి స‌హా మ‌రికొంద‌రికి తాజాగా నాంప‌ల్లిలోని సీబీఐకోర్టు 7 ఏళ్ల…

2 hours ago

పాక్ పై భారత్ ‘ఆపరేషన్ సిందూర్’ విజయవంతం

జమ్మూ కాశ్మీర్ లోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన దాడిలో 28 మంది అమాయకులు అశువులు బాసిన సంగతి తెలిసిందే.…

3 hours ago

ఇప్పుడు కానీ సమంత కొడితే…

హీరోయిన్లుగా ఒక వెలుగు వెలిగాక.. ఏదో ఒక దశలో డౌన్ కావాల్సిందే. హీరోల మాదిరి దశాబ్దాల తరబడి కెరీర్లో పీక్స్‌లో…

9 hours ago

అమరావతిలో ‘బసవతారకం’కు మరో 6 ఎకరాలు

టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ సీనియర్ నేత, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో నడుస్తున్న ఇండో అమెరికన్ బసవతారకం…

10 hours ago

సినిమా పరిశ్రమకు వార్ ముప్పు ఉందా

పెహల్గామ్ దుర్ఘటన తర్వాత ఇండియా, పాకిస్థాన్ మధ్య ఏర్పడిన ఉద్రిక్తతలు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తాయో ఊహించడం కష్టంగా ఉంది.…

11 hours ago