Trends

గోదావ‌రి టు హైద‌రాబాద్‌.. పందెం కోళ్ల ప‌రుగు!!

ఏపీలోని గోదావ‌రి జిల్లాల పేరు చెప్ప‌గానే ‘పందెం కోళ్లు’ గుర్తుకు వ‌స్తాయి. ఆయా జిల్లాల్లో ఎక్క‌డో ఒక చోట రోజూ పందేలు కామ‌న్‌. ఇక‌, తెలుగు వారి పెద్ద పండుగ సంక్రాంతి వ‌చ్చిందంటే పందేల‌కు తిరుగులేదు. ఈ ఏడాది అయితే.. ఊరూ వాడా విచ్చ‌ల‌విడిగా చెల‌రేగి మ‌రీ పందేలు కాశారు. సుమారు 2 వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు కోడి పందేల్లో సొమ్ములు పారిన‌ట్టు స‌మాచారం. ఇక‌, ఇప్పుడు ఈ గోదావ‌రి సంస్కృతి రెక్క‌లు క‌ట్టుకుని హైద‌రాబాద్‌కు వాలిపోయింది.

తాజాగా హైదరాబాద్ శివారులోని ఫాం హౌస్‌లో కోడి పందేలు నిర్వ‌హిస్తున్న‌ట్టు వ‌చ్చిన వార్త‌లు క‌ల‌కలం రేపాయి. అదేస‌మ‌యంలో వైసీపీ హ‌యాంలో గుడివాడ‌కు ప‌రిమిత‌మైన క్యాసినో జూదం కూడా హైద‌రాబాద్ కు చేరిపోయింది. ఈ వ్య‌వ‌హారంపై ఉప్పందుకున్న రాజేంద్ర‌న‌గ‌ర్ పోలీసులు స‌ద‌రు ఫామ్ హౌస్ పై దాడి చేసి 64 మందిని అరెస్టు చేశారు. కోడి పందేలు, క్యాసినో కోసం సిద్ధం చేసిన 30 లక్షల రూపాయల నగదును సీజ్ చేయ‌డంతోపాటు 55 లగ్జరీ కార్లను స్వాధీనం చేసుకున్నారు.

ఇక, ఫామ్ హౌస్‌లో ఉన్న 86 పందెం కోళ్ళను కూడా పోలీసులు స్టేష‌న్‌కు త‌ర‌లించారు. వీటిని గోదావ‌రి జిల్లాల నుంచి త‌ర‌లించిన‌ట్టు తెలిపారు. పెద్ద మొత్తంలో బెట్టింగ్ కాయిన్స్ స్వాధీనం చేసుకున్న‌ట్టు చెప్పారు. అలాగే.. పందెం కోళ్లకు క‌ట్టేందుకు తీసుకువ‌చ్చిన‌ 46 విదేశీ కోడి కత్తులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని ప్రముఖులను ఆహ్వానించి.. ఈ కోడిపందేలు క్యాసినో నిర్వహిస్తున్నార‌ని పేర్కొన్నారు. ఈ క్ర‌మంలో ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాకు చెందిన శివకుమార్ వర్మ అనే వ్య‌క్తిని అదుపులోకి తీసుకున్నారు. కాగా.. ఈయ‌న‌పై గ‌తంలోనూ కేసు న‌మోదైంద‌ని తెలిపారు.

This post was last modified on February 12, 2025 6:21 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

విదేశీ యూనివ‌ర్సిటీల డాక్టరేట్లు వదులుకున్న చంద్రబాబు

ఏపీ సీఎం చంద్ర‌బాబుకు ప్ర‌ముఖ దిన‌ప‌త్రిక `ఎక‌న‌మిక్ టైమ్స్‌`.. ప్ర‌తిష్టాత్మ‌క వ్యాపార సంస్క‌ర్త‌-2025 పుర‌స్కారానికి ఎంపిక చేసిన విష‌యం తెలిసిందే.…

30 minutes ago

బంగ్లా విషయంలో భారత్ భద్రంగా ఉండాల్సిందేనా?

బంగ్లాదేశ్‌లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్‌కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…

1 hour ago

ఆమెకు ‘ఏఐ’ మొగుడు

ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…

1 hour ago

ఖర్చు పెట్టే ప్రతి రూపాయి లెక్క తెలియాలి

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఖ‌ర్చుచేసేది ప్ర‌జాధ‌న‌మ‌ని సీఎం చంద్ర‌బాబు తెలిపారు. అందుకే ఖ‌ర్చు చేసే ప్ర‌తి రూపాయికీ ఫ‌లితాన్ని ఆశిస్తాన‌ని చెప్పారు.…

3 hours ago

వాళ్ళిద్దరినీ కాదని చంద్రబాబుకే ఎందుకు?

`వ్యాపార సంస్క‌ర్త‌-2025` అవార్డును ఏపీ సీఎం చంద్ర‌బాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశ‌వ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్య‌మంత్రులు…

4 hours ago

దమ్ముంటే నన్ను జైలుకు పంపు: జగన్ కు బీజేపీ మంత్రి సవాల్

మెడికల్ కాలేజీలను సొంతం చేసుకున్న వారిని తాను అధికారం లోకి రాగానే రెండు నెలల్లో జైలుకు పంపుతాను అన్న వైఎస్…

5 hours ago