ఏఐ దిగ్గజం `మెటా` చీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, `ఫేస్ బుక్` అధినేత మార్క్ జుకర్ బర్గ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ ప్రభుత్వం తనను చంపేసేందుకు ప్రయత్నిస్తోందని వ్యాఖ్యానించారు. దీనిని అధికారికంగాఅమలు చేసేందుకు కేసులు పెట్టించే ప్రయత్నాల్లో ఉందన్నారు. “అధికారికంగా నన్ను ఉరి వేసే కుట్రలు చేస్తున్నట్టు నాకు సమాచారం ఉంది. దీనిని వారు సమర్ధించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ, ఇది ముమ్మాటికీ భావప్రకటనపై చేస్తున్న కుట్రగానే చెబుతున్నా“ అని జుకర్‌బర్గ్ వ్యాఖ్యా నించారు.
జుకర్ బర్గ్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతున్నాయి. దీంతో అసలు ఏం జరిగిందన్న విషయంపై సోషల్ మీడియాలో చర్చ సాగుతోంది. విషయంలోకి వెళ్తే.. కొన్ని రోజుల కిందట పాకిస్థాన్‌లో కొందరు ఫేస్‌బుక్‌లో మమ్మదీయులను కించ పరుస్తూ.. పోస్టులు దర్శన మిచ్చాయి. దీనిపై పాకిస్థాన్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఆ వెంటనే వాటిని తొలగించారు. అయితే.. ఈ పోస్టులు పెట్టిన వారి వివరాలు తమకు ఇవ్వాలని.. లేకపోతే.. ఫేస్‌బుక్‌పైనే కేసు నమోదు చేస్తామని ప్రకటించింది.
అయితే.. పోస్టుల పెట్టిన వారి వివరాలుఇచ్చేందుకు తమ నిబంధనలు ఒప్పుకోవని.. కాబట్టి ఇవ్వలేమని ఫేస్ బుక్ అధినేత జుకర్‌బర్గ్ పాకిస్థాన్‌కు లేఖ రాశారు. దీనిపై పాకిస్థాన్ మరింత ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నేరుగా ఆయనపైనే కేసు నమోదుచేసింది. ప్రస్తుతం పాకిస్థాన్‌సుప్రీంకోర్టులోఈ కేసు విచారణకు రానుంది. అయితే.. పాక్ ప్రభుత్వం తనకు మరణ శిక్ష విధించాలని సుప్రీంకోర్టును కోరనుందన్న విషయం తనకు తెలిసిందని పేర్కొన్నారు.
ఇదే జరిగితే.. భావనా ప్రకటనా స్వేచ్ఛను హరించినట్టేనని జుకర్‌బర్గ్ ఆవేదన వ్యక్తం చేస్తూ.. సోషల్ మీడియాలో పంచుకున్న సందేశం ప్రపంచ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. దీనిపై హక్కుల సంఘాలు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒక మతాన్ని, లేదా వ్యక్తులను కించపరిచాలనేది ఫేస్ బుక్ ఉద్దేశం కాదని.. జుకర్ బర్గ్‌పేర్కొన్నారు. విషయం తమ దృష్టికి రాగానే సదరు పోస్టులనుతాము తొలగించామని చెబుతున్నారు. కానీ, పాకిస్థాన్ మాత్రం సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోందని తెలిపింది.
This post was last modified on February 12, 2025 5:38 pm
మహారాష్ట్ర జల్గావ్ జిల్లా పచోరా తాలూకా పుంగావ్ గ్రామానికి చెందిన జవాన్ మనోజ్ జ్ఞానేశ్వర్ పాటిల్ వివాహం మే 5న…
నాలుగేళ్ల కిందట మోడీని చంపేస్తామని.. ఆయన తల తెచ్చిన వారికి బహుమానం ఇస్తామని లష్కరే తాయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన…
పహల్ గాం ఉగ్రదాడిని ప్రోత్సహించి భారత్ తో సున్నం పెట్టుకున్న దాయాదీ దేశం పాకిస్తాన్ కు ఇప్పుడు షాకుల మీద…
తమిళ అగ్ర కథానాయకుల్లో ఒకడైన జయం రవి కుటుంబ వివాదం కొంత కాలంగా మీడియాలో, సోషల్ మీడియాలో చర్చనీయాంశం అవుతోంది.…
అదిగో పులి.. అంటే ఇదిగో తోక.. అన్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం పరుగులు పెడుతోంది. ప్రస్తుతం భారత్-పాక్ ఉద్రిక్తతల నేపథ్యంలో…
జైలర్ 2లో బాలకృష్ణ ప్రత్యేక క్యామియో చేయడం దాదాపు ఖరారయినట్టే. టీమ్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు కానీ బాలయ్య వైపు…