Trends

వైరల్ వీడియో… కోహ్లీ హగ్ ఇచ్చిన లక్కీ లేడీ ఎవరు?

టీమిండియా స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. మైదానంలోనే కాదు, ప్రాక్టీస్ సెషన్లకు కూడా అభిమానులు భారీగా హాజరవుతుంటారు.

తాజాగా కోహ్లీ మరోసారి తన అభిమానులతో జరిగిన ఆసక్తికర ఘటనతో వార్తల్లోకి ఎక్కారు. ఇంగ్లాండ్‌తో రెండో వన్డే అనంతరం భారత జట్టు అహ్మదాబాద్‌కు బయలుదేరే ముందు భువనేశ్వర్ విమానాశ్రయంలో కోహ్లీ అభిమానులతో ముచ్చటించారు.

విమానాశ్రయంలో చెకింగ్ ఏరియాకు ముందు అభిమానులు తమ ఫేవరెట్ ఆటగాళ్లను చూడటానికి ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే కోహ్లీ అక్కడికి చేరుకుని, అభిమానులను చూసి చిరునవ్వు చిందించాడు. అంతేకాకుండా, అక్కడే నిలబడి ఉన్న ఓ మహిళ దగ్గరకు వెళ్లి ఆమెను హత్తుకొని ముచ్చటించాడు.

కోహ్లీ ఆ మహిళను హగ్ చేయడాన్ని చూసిన ఇతర ఫ్యాన్స్ షేక్‌హ్యాండ్ ఇవ్వాలని ముందుకు రావడంతో భద్రతా సిబ్బంది జోక్యం చేసుకుని కోహ్లీని అక్కడి నుంచి పంపించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కోహ్లీ హగ్ ఇచ్చిన ఆ లక్కీ లేడీ ఎవరో తెలుసుకోవాలని నెటిజన్లు తెగ చర్చించుకుంటున్నారు.

అయితే ఆమె కోహ్లీకి దగ్గరి బంధువు అని సమాచారం. అందుకే కోహ్లీ ఆమెను హగ్ చేశాడని తెలుస్తోంది. కానీ తను ఒక అభిమాని అని కొందరు చెబుతున్నారు. ఈ ఘటన మరోసారి కోహ్లీ అభిమానుల ప్రేమను రుజువు చేస్తోంది.

కొద్ది రోజుల క్రితం కోహ్లీ ఎయిర్పోర్ట్ లోకి వెళ్తున్న సమయంలో అక్కడి సెక్యూరిటీ గార్డ్ ఒకరు ఆటోగ్రాఫ్ ఇవ్వమని కోరగా ఫ్లైట్ టైం అయిపోతున్న తరుణంలో కోహ్లీ ఆటోగ్రాఫ్ ఇవ్వలేక వెళ్ళిపోవాల్సి వచ్చింది. అది చూసిన నెటిజన్లు కోహ్లీ పై భిన్నాభిప్రాయాలు వ్యక్తపరిచారు. కానీ తాజాగా ఈ వీడియో చూసిన కోహ్లీ అభిమానులు ఫ్యాన్స్ అంటే కోహ్లీ కి ఎంత ప్రేమో అని పోస్టుల రూపం లో అభిమానం వ్యక్తం చేస్తున్నారు.

భారత్-ఇంగ్లాండ్ మధ్య మూడు వన్డేల సిరీస్‌లో ఇప్పటివరకు రెండు మ్యాచ్‌లు ముగిశాయి. ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ టీమిండియా ఘన విజయం సాధించింది. దీంతో 2-0తో సిరీస్‌ను కైవసం చేసుకుంది. బుధవారం అహ్మదాబాద్ వేదికగా మూడో వన్డే జరగనుంది. అయితే ఇప్పటికే సిరీస్ భారత్ ఖాతాలో పడిన నేపథ్యంలో చివరి మ్యాచ్ నామమాత్రంగా మారింది.

This post was last modified on February 11, 2025 5:46 pm

Share

Recent Posts

జనాభా పెరుగుతుంటే ఓట్లు ఎలా తగ్గుతాయి?

ఓటర్ల ప్రత్యేక సవరణపై సమరం కొనసాగుతూనే వుంది. దేశ రాజధాని ఇంద్రప్రస్థ కురుక్షేత్ర యుద్దాన్ని తలపిస్తుంది. కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు,…

37 minutes ago

రాజమౌళి కనక రామాయణ తీసుంటే

ఇంకో ఇరవై మూడు రోజుల్లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద ఉండాల్సినంత బజ్ లేదనేది వాస్తవం. రన్బీర్…

8 hours ago

శాండల్‌వుడ్ అరుదుగా చూసే అద్భుతం ఇది

ఒక సినిమా పదిహేడు రోజులు పూర్తి చేసుకున్న తర్వాత కూడా బిసి సెంటర్స్ లో హౌస్ ఫుల్స్ కావడం ఎక్కడైనా…

11 hours ago

వారణాసి తరహా నేపథ్యంతో యష్ మూవీ ?

టాక్సిక్ డిజాస్టర్ తర్వాత బయట దర్శనం లేని హీరో యష్ త్వరలో రామాయణ రెండు భాగాల్లో రావణుడిగా కనిపించబోతున్న సంగతి…

11 hours ago

దురంధర్ సృష్టికర్త చుట్టూ తొలగని సస్పెన్స్

గత ఏడాది డిసెంబర్ ముందు వరకు బాలీవుడ్ మూవీ లవర్స్ కి తప్ప మిగిలినవాళ్లకు అంతగా పరిచయం లేని పేరు…

11 hours ago

రణబాలి గెలవాల్సింది రెండు యుద్ధాలు

ఈ వారం విడుదల కాబోతున్న రణబాలి మొత్తంగా రెండు యుద్ధాలు చేయాల్సి ఉంటుంది. ఒకటి రజనీకాంత్ జైలర్ 2ని ఫేస్…

11 hours ago