మహిళల అండర్-19 టీ20 వరల్డ్ కప్‌ను వరుసగా రెండోసారి గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ గౌరవార్థంగా భారీ నగదు బహుమతి ప్రకటించింది. మొత్తం జట్టుకు, సహాయక సిబ్బందికి కలిపి రూ.5 కోట్ల ప్రోత్సాహకాన్ని అందజేయనున్నట్లు తెలిపింది.
మలేసియాలో జరిగిన ఫైనల్‌లో దక్షిణాఫ్రికాను 9 వికెట్ల తేడాతో చిత్తుచేసిన టీమిండియా, చరిత్ర సృష్టించింది. సఫారీలను కేవలం 82 పరుగులకే కట్టడి చేసిన భారత అమ్మాయిలు, 83 పరుగుల లక్ష్యాన్ని 11.2 ఓవర్లలో 1 వికెట్ మాత్రమే కోల్పోయి ఛేదించి టైటిల్‌ను దక్కించుకున్నారు.
ఈ గెలుపులో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష అసాధారణ ప్రదర్శన కనబరిచింది. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టిన త్రిష, బ్యాటింగ్‌లోనూ తన మార్క్ చూపిస్తూ 33 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. టోర్నమెంట్ మొత్తం ఆమె 309 పరుగులతో పాటు 7 వికెట్లు తీసి అద్భుతమైన ఆల్ రౌండ్ షో కనబరిచింది. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మరియు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది.
ఈ గెలుపులో తెలుగు అమ్మాయి గొంగడి త్రిష అసాధారణ ప్రదర్శన కనబరిచింది. బౌలింగ్‌లో 3 వికెట్లు పడగొట్టిన త్రిష, బ్యాటింగ్‌లోనూ తన మార్క్ చూపిస్తూ 33 బంతుల్లో 44 పరుగులు చేసి అజేయంగా నిలిచింది. టోర్నమెంట్ మొత్తం ఆమె 309 పరుగులతో పాటు 7 వికెట్లు తీసి అద్భుతమైన ఆల్ రౌండ్ షో కనబరిచింది. ఈ ప్రదర్శనకు గుర్తింపుగా ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ మరియు ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అవార్డులను తన ఖాతాలో వేసుకుంది.
టీమిండియా బౌలింగ్ విభాగంలో వైష్ణవి శర్మ 17 వికెట్లు, ఆయుశి శుక్లా 14 వికెట్లు తీసి ప్రత్యర్థి జట్లకు చుక్కలు చూపించారు. బౌలర్లు తక్కువ స్కోరుకే ప్రత్యర్థులను ఆలౌట్ చేయడంతో, బ్యాటింగ్ విభాగం సునాయాసంగా విజయాన్ని ఖాయం చేసింది. 2023 తర్వాత మరోసారి వరల్డ్ కప్‌ను గెలుచుకోవడం ద్వారా భారత యువజట్టు తన హవాను కొనసాగించింది.
భారత అమ్మాయిల అద్భుత ప్రదర్శనకు అన్ని వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. బీసీసీఐ ప్రకటించిన నగదు బహుమతితో పాటు క్రికెట్ అభిమానుల మద్దతు కూడా విపరీతంగా పెరుగుతోంది. వరుసగా రెండోసారి ఈ ఘనత సాధించడం భారత మహిళా క్రికెట్‌కు గొప్ప మైలురాయి అని విశ్లేషకులు అంటున్నారు. అలాగే ప్రధాని మోడీ సైతం వీర వనితలపై ప్రశంసలు కురిపించారు.
This post was last modified on February 3, 2025 11:36 am
భారత యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్. ప్రజ్ఞానంద్ తన అద్భుతమైన ప్రదర్శనతో టాటా స్టీల్ చెస్ మాస్టర్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు.…
1995 దాకా దేశంలో అటు కేంద్ర ప్రభుత్వమైనా… ఇటు రాష్ట్ర ప్రభుత్వాలైనా కొనసాగించింది కేవలం పరిపాలన మాత్రమే. అయితే 1995లో…
ముంబయిలో జరిగిన ఐదో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ ఇంగ్లండ్ బౌలర్లను ఊచకోత కోసి, కేవలం 37…
ఒక్కోసారి ఛాయాచిత్రాలు పెద్ద కథలు చెబుతాయి. నిన్న సందీప్ రెడ్డి వంగా అలాంటి చర్చకే చోటిచ్చారు. తన ఆఫీస్ తాలూకు…
తండేల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో దిల్ రాజు వేదికపైకి వచ్చినప్పుడు ఆయన గురించి అల్లు అరవింద్ చెప్పిన మాటలు…
టీడీపీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న టాలీవుడ్ నట సింహం నందమూరి బాలకృష్ణ ఇప్పుడు ఏది పట్టినా బంగారమే అవుతోంది. ఇప్పటికే సినిమాల్లో…