Trends

భారత ఆటగాళ్లతో స్నేహం వద్దు: పాక్ మాజీ కెప్టెన్

వరల్డ్ క్రికెట్ హిస్టరీలో ఎక్కువగా క్రేజ్ ఉండే ఒకే ఒక్క క్లాష్ భారత్ vs పాకిస్థాన్. లైవ్ బ్రాడ్ క్యాస్ట్ లో అత్యధిక వ్యూవర్షిప్ సాధించిన మ్యాచ్ లలో ఎక్కువగా ఈ రెండిటి మధ్యలో జరిగినవే. ఇక ఫ్యాన్స్ మధ్యలో ఉండే వాతావరణం ఎంత ఘాటుగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈమధ్య కాలంలో ఆటగాళ్లు కాస్త స్పోర్టివ్ గా స్నేహంగానే ఉన్నప్పటికీ ఒకప్పుడు ఇంజమామ్, ఆఫ్రిది లాంటి ఆటగాళ్లపై గంభీర్, జహీర్ ఖాన్ లాంటి భారత ఆటగాళ్లు గుర్రుగా ఉండేవారు.

అయితే మారుతున్న కాలానికి తగ్గట్టుగా దాయాదుల మధ్య మ్యాచ్ జరిగినప్పుడు ఆటగాళ్ల మధ్య కూల్ వాతావరణం కనిపిస్తుంది. అయితే ఈ తరహా స్నేహం మంచిది కాదని కొందరు సీనియర్ ఆటగాళ్లు కామెంట్ చేయడం వైరల్ అవుతోంది. ముఖ్యంగా పాక్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మొయిన్ ఖాన్ తన తాజా వ్యాఖ్యలతో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు.

భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌ల్లో తమ ఆటగాళ్లు ప్రత్యర్థులతో స్నేహపూర్వకంగా మెలగడం సరైనదికాదని ఆయన సూచించారు. ప్రొఫెషనలిజానికి కొన్ని హద్దులు ఉండాలని, మైదానంలో కేవలం గెలుపుపైనే దృష్టి పెట్టాలని హెచ్చరించారు. ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో ఫిబ్రవరి 23న భారత్, పాకిస్థాన్ జట్లు తలపడనున్న నేపథ్యంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

తాజా మ్యాచ్‌లను గమనిస్తుంటే, పాక్ ఆటగాళ్లు భారత్ క్రికెటర్లను గౌరవించడమే కాకుండా వారితో అతి స్నేహపూర్వకంగా వ్యవహరిస్తున్నారని, ఇది ఆత్మవిశ్వాసం కోల్పోయేలా మారుతుందన్నారు. బ్యాట్స్‌మెన్ క్రీజులోకి వచ్చినప్పుడు బ్యాట్ చెక్ చేయడం, వారి భుజాలను తట్టి ప్రోత్సహించడం వంటి చర్యలు ఎందుకు చేస్తున్నారో తనకు అర్థం కావడంలేదని చెప్పారు.

తమ తరంలో సీనియర్ ఆటగాళ్లు ఎప్పుడూ భారత్‌తో మ్యాచ్ ఆడేటప్పుడు ఎలాంటి మినహాయింపులు ఇవ్వొద్దని చెప్పేవారని, కనీసం వారి ఆటతీరును మెచ్చుకోవడానికైనా అవకాశమివ్వకూడదని సూచించేవారని వెల్లడించారు. పోటీదారులను గౌరవించడం తప్పుకాదని, కానీ మైదానంలో వారితో అనవసరమైన స్నేహభావం ప్రదర్శించడం తమ బలహీనతగా మారుతుందని హెచ్చరించారు.

ప్రస్తుత ఆటగాళ్లు ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని సూచించారు. అంతేకాదు, మ్యాచ్ ముగిసిన తర్వాత కూడా ప్రొఫెషనలిజం అనేది కొనసాగాలని, వ్యక్తిగత సంబంధాలకు అక్కడ చోటుండకూడదని మొయిన్ ఖాన్ అభిప్రాయపడ్డారు.

భారత ఆటగాళ్లతో కలిసి ఫొటోలు దిగడం, సరదాగా మాట్లాడడం వంటి ప్రవర్తన వల్ల మైదానంలో ఆటపైనా ప్రతికూల ప్రభావం చూపిస్తుందని అన్నారు. గతంలో పాక్ క్రికెటర్లు పూర్తిగా ఆటపైనే దృష్టి పెట్టేవారని, ప్రస్తుతం ఆటగాళ్లు ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్నారని పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌లకు విశేష క్రేజ్ ఉండటంతో, ఇలాంటి వ్యాఖ్యలు క్రికెట్ అభిమానుల్లో ఆసక్తిని పెంచాయి.

అయితే, ఆటను కేవలం గెలుపోటముల కోణంలో చూడకూడదని భావించే వారు మొయిన్ ఖాన్ వ్యాఖ్యలతో విభేదిస్తున్నారు. రెండు జట్ల మధ్య ఆరోగ్యకరమైన పోటీ ఉండాలని, ఆటను ఆస్వాదించే దిశగా వెళ్లాలని కొందరు విశ్లేషకులు అంటున్నారు. మరి ఫిబ్రవరిలో జరిగే మ్యాచ్‌లో పాక్ ఆటగాళ్లు ఈ సూచనలను పాటిస్తారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం.

This post was last modified on January 31, 2025 4:57 pm

Share

Recent Posts

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

20 minutes ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

2 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

2 hours ago

నాగవంశీ కారణాలు నమ్మశక్యంగా ఉన్నాయా

నిన్న రాత్రంతా ప్రచారం జరిగినట్టే ఆదర్శ కుటుంబం ఏకె 47 వాయిదా అఫీషియలయ్యింది. నిర్మాత నాగవంశీ ప్రెస్ మీట్ పెట్టి…

3 hours ago

తమిళ రాజకీయాల్లోకి ఇంకో స్టార్?

జయలలిత, కరుణానిధి ఒకరి తర్వాత ఒకరు మరణించడంతో తమిళ రాజకీయాల్లో చాలా ఏళ్ల కిందటే ఒక పెద్ద ఖాళీ ఏర్పడింది.…

3 hours ago

ట్రెండింగ్ సాంగ్ ‘జిలేబి’ని ఎవరు వాడుకుంటారో

ఈ మధ్య సినిమాల్లో ఛార్ట్ బస్టర్ సాంగ్స్ కు కరువొచ్చి పడింది. ఆల్బమ్ మొత్తంలో ఒకటి రెండు పాటలు బాగుంటే…

4 hours ago