అండర్ 19 వరల్డ్ కప్ క్రికెట్ లో భారత బాలికల జట్టు సత్తా చాటుతోంది. కౌలాలంపూర్ వేదికగా సాగుతున్న ఈ మెగా టోర్నీలో ఇప్టటి,కే సెమీస్ చేరిన టీమిండియా తాజాగా శుక్రవారం జరిగిన సెమీ ఫైనల్ లో బలమైన ఇంగ్లండ్ జట్టును చిత్తు చేసి టైటిల్ పోరుకు అర్హత సాధించింది. ఆదివారం జరగనున్న ఫైనల్ లో దక్షిణాఫ్రికాతో భారత జట్టు తలపడనుంది. ఈ సిరీస్ ఆరంభం నుంచి అదరగొడుతున్న భారత బాలికల జట్టు ఫైనల్ లో ఫేవరేట్ గా బరిలోకి దిగనుంది.
అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీకి వెళ్లిన భారత జట్టులో తెలంగాణకు చెందిన గొంగడి త్రిష చోటు దక్కించుకున్న సంగతి తెలిసిందే. చోటు దక్కించుకోవడంతోనే కాకుండా తన బ్యాటుతో మెరుపులు మెరిపిస్తున్న త్రిష…లీగ్ మ్యాచ్ లో సెంచరీ నమోదు చేసింది. ఈ సెంచరీతో అండర్ 19 క్రికెట్ లో తొలి సెంచనీ చేసిన క్రీడాకారిణిగా త్రిష రికార్డులకెక్కింద. తాజాగా సెమీస్ లో ఇంగ్లండ్ తో జరగిన మ్యాచ్ లో కూడా త్రిష 35 పరుగులు చేసి జట్టు విజయంలో కీలక భూమిక పోషించింది.
సెమీస్ లో ఇంగ్లండ్ తో జరిగిన మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ జట్టు… నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 113 పరుగులు చేసింది. ఆ తర్వాత 114 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత జట్టు… 15 ఓవర్లలోనే 1 వికెట్ నష్టానికి 117 పరుగులు చేసింది. దీంతో 5 ఓవర్లు మిగిలి ఉండగానే భారత జట్టు విజయం సాధించింది. బారత ఇన్నింగ్స్ లో కమలిని 56 పరుగులు చేయగా… త్రిష 29 బంతుల్లోనే 35 పరుగులు చేసి మంచి స్ట్రైక్ రేట్ సాధించింది. ఇక ఎల్లుండి జరగనున్న ఫైనల్ లో మరోమారు త్రిష తన బ్యాటును ఝుళిపిస్తే… వరల్డ్ కప్ ఇండియాకు వచ్చినట్టేనని చెప్పాలి.
This post was last modified on January 31, 2025 4:13 pm
వైసీపీ పాలనా కాలంలో తిరుమల శ్రీవారి పరకామణిలో 900 డాలర్ల చోరీ జరిగిన విషయం తెలిసిందే. ఈ పరిణామం తిరుమల…
నేటి రాజకీయ నాయకులలో చాలామందిలో పారదర్శకత కోసం భూతద్దం వేసి వెతికినా కనిపించదు. జవాబుదారీతనం గురించి మాట్లడుకునే అవసరం లేదు.…
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…