భారతదేశం అంతరిక్ష పరిశోధనలో మరో మైలురాయిని అధిగమించేందుకు సిద్ధమైంది. లక్నోలో జన్మించిన భారత వైమానిక దళ అధికారి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్లా, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్)లో అడుగుపెట్టనున్న తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించబోతున్నారు. యాక్సియోమ్-4 మిషన్‌లో పైలట్‌గా వ్యవహరించనున్న ఆయన, అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా అనుమతితో, స్పేస్ ఎక్స్ అభివృద్ధి చేసిన డ్రాగన్ స్పేస్ క్రాఫ్ట్ ద్వారా అంతరిక్ష ప్రయాణం చేయనున్నారు.
ఈ ప్రయోగం 2025 వసంత ఋతువులో చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇంతవరకు రాకేష్ శర్మ మినహా ఏ భారతీయుడూ అంతరిక్ష యాత్ర చేయలేదు. 1984లో సోవియట్ యూనియన్ నిర్వహించిన మిషన్‌లో ఆయన పాల్గొన్నారు. దాదాపు నాలుగు దశాబ్దాల అనంతరం మరో భారతీయుడు అంతరిక్షంలో అడుగుపెడుతుండటం భారత అంతరిక్ష పరిశోధనలో ఓ గర్వకారణంగా మారింది.
శుభాంశు శుక్లా ఈ ప్రయాణంలో భారత సంస్కృతిని ప్రతిబింబించేందుకు సిద్ధమయ్యారు. ఆయన తనతో పాటు భారతదేశంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రత్యేకమైన వస్తువులను తీసుకెళ్లాలని భావిస్తున్నారు. అంతేకాదు, శూన్య గురుత్వాకర్షణ వాతావరణంలో యోగాసనాలు చేసి వాటి ప్రభావాన్ని పరిశీలించనున్నారు. యోగాతో ఎన్నో ఆరోగ్య ఫలితాలు అందుకోవచ్చు అని ప్రపంచానికి మార్గదర్శకంగా నిలిచింది భారత్. ఇక ఇప్పుడు శుక్లా అంతరిక్షంలో చేయబోయే యోగాసనాలు ఎలాంటి ఫలితాలను ఇస్తాయో చూడాలి.
అంతరిక్ష ప్రయాణం అనేది కేవలం ఒక వ్యక్తి సాధించే విజయం మాత్రమే కాదు, అది దేశవ్యాప్తంగా ఉన్న 1.4 బిలియన్ల మంది భారతీయుల గర్వకారణమని శుభాంశు స్వయంగా చెప్పారు. అలాగే తన అనుభవాలను ఫోటోలు, వీడియోల ద్వారా భారత ప్రజలతో పంచుకోవాలని భావిస్తున్నారు. ఇక తనతో వచ్చిన వారికి ఇండియన్ వంటకాలు కూడా తీసుకుని వెళ్లనున్నాడు. ఈ మిషన్‌లో శుభాంశుతో పాటు పోలాండ్‌కు చెందిన స్లావోష్ ఉజ్నాన్స్కీ, హంగేరీకి చెందిన టిబోర్ కపూ కూడా భాగస్వాములవుతున్నారు. నాసా మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ ఈ మిషన్‌కు సారథ్యం వహించనున్నారు.
ప్రయోగం విజయవంతమైతే, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని కొన్ని కీలక పరిశోధనలకు శుభాంశు పాలుపంచుకోనున్నారు. ఈ మిషన్‌లో 14 రోజుల పాటు వ్యోమగాములు ఐఎస్ఎస్‌లో ఉండి మరింత విస్తృత పరిశోధనలు చేపట్టనున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) కూడా ఈ మిషన్‌లో భాగస్వామిగా ఉండటం గమనార్హం.
శుభాంశు శుక్లా భవిష్యత్‌లో భారతదేశం చేపట్టనున్న గగన్‌యాన్ మిషన్‌లోనూ కీలక పాత్ర పోషించనున్నారు. ఇది పూర్తిగా భారతదేశం స్వయంగా అభివృద్ధి చేసిన మొదటి మానవ అంతరిక్ష ప్రయోగం కావడం విశేషం. ఈ మిషన్ విజయవంతమైతే, భారతదేశం అంతర్జాతీయ అంతరిక్ష పరిశోధనలో మరింత ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది.
This post was last modified on January 31, 2025 2:26 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…