భార్యను చంపేసి.. శవాన్ని మాయం చేసేందుకు అత్యంత క్రూరంగా వ్యవహరించిన గురుమూర్తికి సంబంధించిన షాకింగ్ నిజాలు వెలుగు చూశాయి. అంతేకాదు.. తాజాగా కోర్టుకు హాజరుపర్చిన సందర్బంగా అతగాడి ధోరణి విస్తుపోయేలా ఉంది. అతడిలో ఏ మాత్రం పశ్చాత్తాపం కనిపించలేదని పోలీసులు.. రాచకొండ సీపీ చెప్పిన విషయం తెలిసిందే.
ఇతగాడి విచిత్రమైన తీరు తాజాగా రంగారెడ్డి కోర్టుల్లోనూ కనిపించింది. భార్యను చంపేసి.. కిరాతకంగా వ్యవహరించిన గురుమూర్తిని తాజాగా రంగారెడ్డి జిల్లా కోర్టులో హాజరుపర్చారు. ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ అడిగిన పలు ప్రశ్నలకు నిందితుడు బెరుకు లేకుండా.. ఎలాంటి పశ్చాత్తాపానికి గురి కాకుండా సమాధానాలు ఇవ్వటం అక్కడున్న వారిని విస్మయానికి గురి చేసింది. పోలీసులు తనను కొట్టలేదని.. తనకు వైద్య పరీక్షలు చేయించినట్లుగా వెల్లడించారు.
లీగల్ ఎయిడ్ కోసం లాయర్ ను పెట్టుకుంటారా? అని న్యాయమూర్తి అడిగితే.. తనకు లాయర్ అవసరం లేదని బదులివ్వటంతో పాటు.. తాను జైల్లో ఉంటానని చెప్పటం గమనార్హం. దీంతో అతడ్నిచర్లపల్లి జైలుకు తరలించారు. అక్కడే పద్నాలుగు రోజులు రిమాండ్ లో ఉండనున్నాడు. ఆ తర్వాత తదుపరి చర్యల కోసం నిర్ణయం తీసుకుంటారు. ఇదంతా ఒక ఎత్తు అయితే.. భార్యను చంపేసి.. ఆమె శవాన్ని కిరాతకంగా మాయం చేసిన గంటల వ్యవధిలోనే పిల్లల్ని ఇంటికి తీసుకొచ్చిన వైనం వెలుగు చూసింది.
ఇద్దరు పిల్లలు అమ్మ ఎక్కడికి వెళ్లిందంటే.. బయటకు వెళ్లిందని చెప్పటంతో పాటు.. ఇంట్లో దుర్వాసన వస్తుందని అడగ్గా.. పండుగ రోజులు కావటంతో చుట్టుపక్కల వారు మటన్ వండుతున్నారని ఒకసారి.. డ్రైయినేజీ వాసన అంటూ వారిని సమాధానపర్చినట్లుగా తెలుస్తోంది. ఎయిర్ ఫ్రెషనర్ తో వాసన పోగొట్టే ప్రయత్నం చేశాడు. వారికి ఆకలేస్తే ఆన్ లైన్ లో ఆహారం తెప్పించాడు.
పిల్లలు బెడ్రూంలోకి వెళ్లకుండా తాళం వేసిన అతను.. వారికి అనుమానం రాకుండా.. అన్నీ జాగ్రత్తలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తల్లిని దారుణంగా హతమార్చిన బాత్రూంలోనే పిల్లల అవసరాలు తీర్చిన వైనం తెలుసుకున్న స్థానికులు షాక్ తింటున్నారు. ఇతగాడి వేరియన్స్ అపరిచితుడ్ని తలపిస్తున్నట్లుగా వ్యాఖ్యలు చేసుకుంటున్నారు.
This post was last modified on January 30, 2025 10:26 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…