ప్యాపారుల మంత్రం ధనార్జనే. అందులో తప్పేమీ లేదు. అయితే జనం లైఫ్ స్టైల్ ఆధారంగా ఇష్జారాజ్యంగా ఆర్జించడమే దోపిడీ. మొన్నటిదాకా ఒకే వస్తువును రెండు రకాల ధరలకు విక్రయించేవారు. అయితే అందుకు వారు వినియోగించుకున్న మార్గం… పేదలు,. ధనికులు నివసించే ప్రాంతాలను ఆధారంగా చేసుకుని ఈ దందాను సాగించారు. మొన్నామధ్య ఈ మంత్రాన్ని మరింత ముందుకు తీసుకెళ్లిన ఓ ఆన్ లైన్ సెల్లింగ్ సంస్థ.. కస్టమర్లు వాడే సెల్ ఫోన్ స్థాయిని బట్టి రేట్లను ఫిక్స్ చేసినట్లుగా ఆరోపణలు వినిపించాయి. ఈ వార్తల్లో ఎంత నిజముందో నిన్నటిదాకా తెలియలేదు గానీ… తాజా ఘటనను చూస్తే అది నిజమేనని చెప్పక తప్పదు.
నగర జీవనానికి ఇప్పుడు వాహనాలు తప్పనిసరిగా మారిపోయాయి. అయితే వాహనం లేని వారో, ట్రాఫిక్ చిక్కులకు భయపడేవారో, లేదంటే దూరాభారం వాహనాన్ని నడపడాన్ని ఇష్టం లేని వారో… ఒలా, ఉబెర్ వంటి అద్దె సేవలను వినియోగిస్తున్నారు. ఇలా సెల్ ఫోన్లలో బుక్ చేస్తే… మోటార్ సైకిళ్ల నుంచి ఖరీదైన కార్ల దాకా మన ఇళ్ల ముందు వాలిపోతున్నాయి. ఈ సేవల ద్వారా బాగానే సంపాదిస్తున్న ఆయా సంస్థలు ఇప్పుడు దురాశతో మరింతగా తెగించేశాయి. వీరి దురాశ గురించి తెలిసిన కేంద్రం… ఒలా, ఉబెర్ సంస్థలకు ఏకంగా నోటీసులు జారీ చేసింది.
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా?. అయితే మీకు తక్కువ ధరలకే ఒలా, ఉబెర్ సేవలు అందుతాయి. అదే మీరు ఐఫోన్ వాడుతున్నారా?.. అయితే మీ జేబును ఆ సంస్థలు గుల్ల చేస్తాయి. ఈ సరికొత్త దందాకు చాలాకాలం క్రితమే ఆ సంస్థలు తెర తీశాయని సమాచారం. ఆండ్రాయిడ్ ఫోన్లను వినియోగించేవారిని ఓ మోస్తరు కస్టమర్లుగా పరిగణిస్తున్న ఆ కంపెనీలు… ఐఫోన్లను వాడుతున్న వారిని మాత్రం ఖరీదైన కస్టమర్లుగా భావిస్తున్నాయి. ఖరీదైన కస్టమర్ల వద్ద ఎంత లాగినా.. వారు పెద్దగా పట్టించుకోరులే అన్న భావనతో ఈ సంస్థలు ఈ సరికొత్త దందాకు తెరలేపినట్లుగా సమాచారం.
అయితే ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్లతో పాటు ఐఫోన్లు కూడా సరసరమైన ధరలకే లబిస్తున్నాయి. పేదలు కూడా చాలా మంది ఐఫోన్లను వాడుతున్నారు. అదే సమయంలో ధనికుల్లో చాలా మంది వాటి జోలికే వెళ్లడం లేదు. ఈ రెండు రకాల వారితో ఈ సంస్థల ఆటలు ఇంతకాలం సాగాయి. అయితే కొందరు అటు ఆండ్రాయిడ్ తో పాటు ఇటు ఐఫోన్లనూ వినియోగిస్తున్నారు కదా. వీరు ఒలా,ఉబెర్ సేవలను వినియోగించిన సందర్భంగా ఈ సంస్థల నయా మోసం బయటపడింది. దీంతో కస్టమర్ల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడంతో కేంద్రం ఈ వ్యవహారంపై దృష్టి సారించింది. ప్రాథమిక పరిశీలనలో బాగంగా ఈ సంస్థల మోసం నిజమేని తేలడంతో వాటికి కేంద్రం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ నుంచి నోటీసులు జారీ అయ్యాయి.
This post was last modified on January 23, 2025 11:05 pm
స్విట్జర్లాండ్ నగరం దావోస్ వేదికగా గడచిన 4 రోజులుగా జరుగుతున్న వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులు గురువారంతో ముగిశాయి. పెట్టుబడులు…
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మంత్రి నారా లోకేశ్ జన్మదినం సందర్భంగా గురువారం చాలా ప్రాంతాల్లో టీడీపీ శ్రేణులు…
రాష్ట్రంలో ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత.. పనిచేసుకుని పోవడం తెలిసిందే. అయితే.. చంద్రబాబు హయాంలో మాత్రం ఏదో గుడ్డిగా పనిచేసుకుని పోతున్నామంటే…
నందమూరి బాలకృష్ణ హిట్ మూవీ ‘భగవంత్ కేసరి’ని తమిళ టాప్ స్టార్ విజయ్ రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. విజయ్…
ప్రస్తుతం స్విట్జర్లాండ్ లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ పెట్టుబడుల సదస్సులో సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు, మంత్రి నారా లోకేష్…
పుష్ప-2 విడుదలకు ముందు ఈ సినిమా బ్యాగ్రౌండ్ స్కోర్ విషయమై ఎంత గొడవ నడిచిందో తెలిసిందే. సుకుమార్ కెరీర్ ఆరంభం…