ఎక్కడో ఢిల్లీలో రెండేళ్ల కిందట ప్రియురాలిని చంపి.. ముక్కలు చేసి ఫ్రిజ్‌లో పెట్టి.. విడతల వారీగా వాటిని అడవిలో విసిరేసిన ఘటన దేశం మొత్తాన్ని కలచి వేసింది. కదిలించేసింది. దీనిపై అనేక మంది బుగ్గలు నొక్కుకున్నారు. ఇంత దారుణం చేస్తారా? అని తల పట్టుకున్నారు. కానీ, ఇప్పుడు మన హైదరాబాద్‌లోనే అచ్చంగా ఇలాంటి ఘటనే జరిగితే!.. ఆశ్చర్యం కాదు నిజం. మాటలకందని ఘోరం మీర్ పేటలో చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకున్న ఓ మాజీ సైనికోద్యోగి.. ఆమెను చంపేశాడు. అంతేకాదు.. ఆమెను ముక్కలు చేసి .. కుక్కర్‌లో ఉడికించాడు. అనంతరం.. వాటిని సమీపంలోని జిల్లెలగూడ చెరువులో చేపలకు ఆహారంగా వేశాడు!!
మనసున్న వారు ఎవరూ ఊహించేందుకు కూడా సాహసించని ఈ ఘోరం.. మీర్ పేటలోనే జరిగింది. అది కూడా ఈ నెల 18నే జరిగింది. భారత సైన్యంలో సిపాయిగా పనిచేసిన గురుమూర్తి.. రిటైర్మెంట్ తర్వాత.. మీర్ పేట పరిధిలోని తూప్రాన్‌లో స్థిరపడ్డా డు. ఈయనకు భార్య మాధవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. సైనికుడిగా పనిచేసిన ఆయనకు పింఛన్ వస్తోంది. అదేవిధంగా ఓ కంపెనీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. వీరికి పెళ్లయి 13 ఏళ్లు అయింది. అయితే.. ఈ మధ్య కాలంలో మాధవిపై అనుమానం పెంచుకున్న గురుమూర్తి.. పలు మార్లు ఆమెతో వివాదానికి దిగాడు. ఈ క్రమంలో ఈ నెల 17న రాత్రి ఆమెను ఇంట్లోనే హత్య చేశాడు.
తర్వాత.. ముక్కలు ముక్కలుగా కోసి.. కుక్కర్‌లో ఉడికించి.. వేర్వేరు సంచుల్లో వాటిని తీసుకువెళ్లి చెరువులో వేశాడు.. వీటిని చేపలు తినేసినట్టు పోలీసులు గుర్తించారు. అయితే.. అసలు ఏమీ తెలియని వాడిగా.. మాధవి తల్లిదండ్రులకు ఫోన్ చేసి.. మీ అమ్మాయి వచ్చిందా? అని ప్రశ్నించాడు. అంటే పండుగకు పుట్టింటికి వచ్చిందని చెప్పాడు.. దీంతో వారు ఆందోళన చెంది.. మీర్ పేట పోలీసులను ఆశ్రయించారు. చిత్రం ఏంటంటే.. అత్తమామలతో కలిసి.. గురుమూర్తి కూడా.. పోలీసుల వద్దకు వెళ్లి కన్నీటి పర్యంతమయ్యాడు. తన భార్య అంటే తనకు ఎనలేని ప్రేమ అని.. ఆమెను వెతికి పెట్టాలని కోరాడు.
ఎలా బయట పడిందంటే!
గురుమూర్తిపై తొలుత పోలీసులకు ఎలాంటి అనుమానం రాలేదు. ఎందుకంటే.. భారత సైన్యంలో పనిచేసిన నేపథ్యం ఉండడంతో ఆయన నిజాయితీని వారు శంకించలేక పోయారు. కానీ, చుట్టుపక్కల విచారించినప్పుడు.. (గురుమూర్తి లేని సమయంలో) భార్యాభర్తల మధ్య వివాదాలు ఉన్నాయని.. తెలిసింది. దీంతో ఆయన పనిచేస్తున్న కంపెనీ వద్ద విచారించగా.. అసలు విషయం వెలుగు చూసింది. దీంతో నేరుగా స్టేషన్‌కు పిలిచి.. విచారించడంతో గురుమూర్తి అసలు విషయం చెప్పాడు. అయితే.. మాంసపు ముద్దలు లభించకపోవడం.. వాటిని చేపలు ఇతర క్రిములు తినేయడంతో డీఎన్ ఏ టెస్టు కోసం.. ప్రయత్నిస్తున్నారు.
This post was last modified on January 23, 2025 10:26 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…