Trends

ట్రంప్ లెగ్గు మయం.. 7 లక్షల కోట్లు ఆవిరి!

ప్రపంచ స్టాక్ మార్కెట్ పై అమెరికా కొత్త అధ్యక్షత ప్రభావం గట్టిగానే ఉంటుందని ముందు నుంచే సంకేతాలు వచ్చాయి. ఇక భారత స్టాక్ మార్కెట్ ట్రంప్ ప్రభావం గట్టిగానే పడింది. అతని రాకతో భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చింది. వివిధ కారణాల ఎన్ని ఉన్నా కూడా ట్రంప్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ అని నిపుణులు చెబుతున్నారు. దాదాపు రూ.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయిందంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందొ అర్థం చేసుకోవచ్చు.

సెన్సెక్స్ ఏకంగా 1,235 పాయింట్ల మేర పతనమవగా, నిఫ్టీ 299 పాయింట్లకు పైగా కోల్పోయింది. సెన్సెక్స్ 76 వేల దిగువకు చేరుకుని 75,838 పాయింట్ల వద్ద ముగిసింది. అదే విధంగా, నిఫ్టీ 23,045 పాయింట్ల వద్ద స్థిరపడింది. మార్కెట్ మొత్తంగా అమ్మకాల ఒత్తిడికి గురై భారీగా కుదేలైంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి రాజకీయాల్లో ప్రభావం చూపడం, మిత్రదేశాలైన మెక్సికో, కెనడాలపై ట్రేడ్ టారిఫ్ విధిస్తామంటూ చేసిన ప్రకటనలతో అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల ప్రభావం పడింది. భారత్ సహా ఇతర దేశాలపై కూడా టారిఫ్‌లు పెంచే అవకాశమున్నదని ట్రంప్ గతంలో చెప్పిన నేపథ్యంలో ఇది మార్కెట్ సెంటిమెంట్‌ను మరింత దెబ్బతీసింది.

ఇతర దేశాల్లో మార్పుల ప్రభావం దేశీయ మార్కెట్ మీద తీవ్రమైంది. ముఖ్యంగా, రిలయన్స్ ఇండస్ట్రీస్, జొమాటో వంటి ప్రధాన కంపెనీల షేర్లలో భారీ అమ్మకాలు జరిగాయి. విదేశీ ఇన్వెస్టర్ల అమ్మకాలు గణనీయంగా పెరగడం మార్కెట్‌ను మరింత ఒత్తిడికి గురిచేసింది. అంతర్జాతీయంగా డాలర్ బాండ్ ఈల్డ్స్ పెరుగుతుండటంతో, విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి నిధులను ఉపసంహరించుకున్నారు.

మరోవైపు, కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఆ సమయంలో ఆర్థిక విధానాలు ఎలా ఉండబోతున్నాయో ఇన్వెస్టర్లు ఆచితూచి పరిశీలిస్తున్నారు. దీంతో తాత్కాలికంగా పెట్టుబడిదారులు జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మొత్తం మీద, ఇప్పుడు మార్కెట్ ముసురులో దాదాపు రూ.7 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ ఆవిరైపోయింది. ఈ నష్టాలు దేశీయ పెట్టుబడిదారులకు గట్టిగా బాదేశాయి. ఇలాంటీ పరిస్థితుల్లో, మార్కెట్ స్థిరత్వం పొందడానికి నెమ్మదిగా మళ్లీ వృద్ధి దిశగా అడుగులు వేయాల్సి ఉంది.

This post was last modified on January 21, 2025 6:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అనిల్ రావిపూడి కారు సమర్పించుకోవాల్సిందే..

నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…

21 minutes ago

వరప్రసాదుకి పోలికలు అవసరం లేదు

మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…

2 hours ago

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

7 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

7 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

7 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

8 hours ago