హైదరాబాద్ మహానగరంలో దారుణం చోటు చేసుకుంది. పుట్టిన రోజు పార్టీ పేరుతో కాలేజీ విద్యార్థిని నమ్మించి గ్యాంగ్ రేప్ చేసిన వైనం సంచలనంగా మారింది. నమ్మించి మోసం చేయటమే కాదు.. తాము చేసిన పనిని బయటకు చెబితే చంపేస్తామని బెదిరించిన వైనాన్ని.. బాధితురాలు ధైర్యంగా బయటకు చెప్పటంతో ఈ దారుణ ఘటన బయటకు వచ్చింది. జూబ్లీహిల్స్ లో తల్లిదండ్రులతో కలిసి ఉండే పందొమ్మిదేళ్ల డిగ్రీ విద్యార్థిని సికింద్రాబాద్ లో చదువుతోంది.
ఆమె ఇంటికి దగ్గర్లోనే జోసెఫ్.. నవీన్ రెడ్డి.. రాములు ఆమెకు స్నేహితులుగా ఉండేవారు. ఇదిలా ఉండగా.. ఈ నెల 5న కాలేజీ టర్మ్ ఫీజు కట్టేందుకు కళాశాలకు వెళ్లింది. అదే సమయంలో ఫోన్ చేసిన జోసెఫ్.. ఈ రోజు తన పుట్టినరోజు అని..పార్టీకి రావాలన్నాడు. మిగిలిన ఇద్దరు స్నేహితులు కూడా వస్తున్నట్లు చెప్పటంతో.. నమ్మిన ఆమె ఓకే చెప్పింది. వీరంతా బిర్యానీ పార్శిల్ తీసుకొని ట్యాంక్ బండ్ వద్ద కాసేపు గడిపారు. అక్కడి నుంచి మధ్యాహ్నం మూడు గంటల వేళలో.. కేపీహెచ్ బీ కాలనీలోని ఒక లాడ్జ్ కు వెళ్లారు. అక్కడ పుట్టిన రోజు వేడుక చేసుకోవాలనుకున్నారు.
కేక్ తెచ్చేందుకు బయటకు వెళ్లిన నవీన్.. కేక్ మీద మత్తు మందు చల్లారు. అందరం కలిసి తిందామంటే.. కాదు.. ముందు నువ్వు తిను అంటూ ఆమె చేత కేక్ తినిపించారు. కాసేపటికే మత్తులోకి వెళ్లిన ఆమెను ఈ ముగ్గురు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం ఆ విషయాన్ని ఎవరికైనా చెబితే.. చంపేస్తామని బెదిరించిన వారు.. ఆమెను ఆటోలో ఇంటికి పంపారు. ఆ తర్వాత నుంచి ఆమె తీవ్ర అస్వస్థతకు గురైంది. ఈ నెల11న అపస్మారకస్థితికి చేరుకోవటంతో ఆమె తల్లిదండ్రులు ఆసుపత్రిలో చేర్చారు. ఆ సందర్భంగా ఆమెపై జరిగిన లైంగిక దాడి వివరాలు బయటకు వచ్చాయి. దీంతో.. జూబ్లీహిల్స్ పోలీసులకు కంప్లైంట్ చేశారు. ఈ ఉదంతాన్ని సీరియస్ గా తీసుకున్న పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. స్నేహం ముసుగులో చోటు చేసుకున్న ఈ దారుణం షాకింగ్ గా మారింది. స్నేహం ఏదైనా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందంటున్నారు.
This post was last modified on October 16, 2020 2:24 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…