దేశ వ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా ప్రకటిస్తోన్న కరోనా కేసుల సంఖ్య చూస్తే నిజంగా కరోనా తగ్గిపోయిందేమోననే భావన కలుగుతుంది. కానీ నిజానికి కరోనా కేసులను రిపోర్ట్ చేయడం మానేసారంతే. ఇంకా దానికి విరుగుడు రాలేదు. అలాగే జనం దాని బారిన పడడం ఆగలేదు.
తెలుగు సినిమా ఇండస్ట్రీ విషయానికే వస్తే షూటింగ్ మొదలైన పలు యూనిట్లలో పలువురికి కరోనా సోకిందట. వారానికోసారి టెస్టులు చేసుకుంటూ ఎవరికి కరోనా వస్తే వారిని ఇంటికి పంపించేసి మిగతా వాళ్లతో షూటింగ్ చేస్తున్నారట. అయితే దీని గురించి మీడియాలో రాకుండా చూసుకుంటున్నారట. కానీ ఇండస్ట్రీలో అయితే పరిస్థితి ఏమిటనేది అందరికీ తెలుసు.
ధైర్యంగా వున్న కొందరు యువ హీరోలు మినహాయించి పెద్ద స్టార్లు, ముఖ్యంగా సీనియర్లు మాత్రం కోవిడ్‍కి భయపడుతున్నారు. నవంబరు నుంచి షూటింగ్ చేద్దామని అనుకున్న వాళ్లు కూడా మరికొన్నాళ్ల పాటు షూటింగ్ వాయిదా వేసుకుంటున్నారు. చిరంజీవి ఆచార్య, వెంకటేష్ నారప్ప షూటింగ్ మొదలు కావడానికి ఇంకా చాలా సమయం వుందంటున్నారు. అలాగే మరో సీనియర్ స్టార్ బాలకృష్ణ కూడా బోయపాటితో చేస్తోన్న సినిమా షూటింగ్ మొదలు పెట్టడానికి సుముఖంగా లేరు.
This post was last modified on October 16, 2020 10:33 am
సోలార్ పవర్ ప్రాజెక్టు విషయంలో అమెరికాలో అదానీపై కేసు నమోదు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. అయితే, సోలార్…
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…