ఒలింపిక్ మెడల్స్ నాణ్యతపై రచ్చరచ్చ

ఒలిపింక్స్ అంటేనే… వరల్డ్ క్లాస్ ఈవెంట్. దీనిని మించిన స్పోర్ట్స్ ఈవెంట్ ప్రపంచంలోనే లేదు. అలాంటి ఈవెంట్ లో విజేతలకు ఇచ్చే పతకాల నాణ్యత ఎలా ఉంటుందన్న దానిపై ఇప్పటిదాకా అసలు అనుమానాలే రాలేదు. అయితే… పారిస్ ఒలింపిక్స్ లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులు ఈ ఈవెంట్ మెడల్స్ ఫై గగ్గోలు పెడుతున్నారు.

ఆలా తమ చేతికి వచ్చిన మెడల్ ఇలా రంగు వెలిసి పోయిందట. ఈ మేరకు భారత క్రీడాకారులే కాకుండా పలు దేశాలకు చెందిన ప్లేయర్స్ కూడా మెడల్స్ కలర్ వెలిసిపోయిందంటూ గగ్గోలు పెడుతున్నారు.

భారత్ కు చెందిన షూటింగ్ ప్లేయర్లు స్వప్నిల్, సరబ్ జ్యోత్ సింగ్ లు పారిస్ ఒలింపిక్స్ లో కాంస్య పతకాలు సాధించిన సంగతి తెలిసిందే. పారిస్ వేదికగా వీరు మెడల్స్ తీసుకోగా… స్వదేశానికి తిరిగి వచ్చేలోగానే వాటి రంగు వెలిసిపోయిందట.

కేవలం 7 రోజుల్లోనే ఈ మెడల్స్ రంగు వెలిసిపోవడంఫై పెద్ద రచ్చ మొదలైంది. పారిస్ ఒలింపిక్స్ లో రెండు పతకాలు సాధించిన మను బాకర్ పతకాలదీ ఇదే స్థితి అంట.

ఇదేదో… ఒక్క భారత క్రీడాకారులకు ఇచ్చిన పెడల్స్ కు పట్టిన గతి కాదు. చాల దేశాలకు చెందిన క్రీడాకారులకు ఇచ్చిన పతకాల పరిస్థితీ ఇదేనట. పారిస్ క్రీడా సంబరం ముగిసిన రోజుల వ్యవధిలోనే ఒలింపిక్స్ కమీటీకి ఈ దిశగా ఫిర్యాదులు రావడం మొదలైందట. దీంతో రంగు వెలసిన మెడల్స్ తిరిగి ఇస్తే వాటి స్థానంలో కొత్త పతకాలను ఇస్తామని అంతర్జాతీయ ఒలింపిక్స్ సంఘం చెబుతోంది.

ఇదే మాటను భారత ఒలింపిక్ సంఘం కూడా చెబుతోంది. అయినా.. రంగు మారిన మెడల్స్ రీప్లేస్ చేస్తామని చెప్పడం కాదు… ఒలింపిక్స్ ప్రతిష్ట దెబ్బ తినేలా ఉన్న ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందన్న దానిపై సమగ్ర విచారణ జరగాలన్న వాదనలు వినిపిస్తున్నాయి.