తెలుగు నేలకు గర్వకారణంగా నిలిచిన టీం ఇండియా యంగ్ అండ్ డైనమిక్ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి సంక్రాంతి వేళ కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సేవలో పాల్గొన్నాడు. ఈ క్రమంలో అతడు తిరుపతి నుంచి తిరుమలకు కాలినడకన వెళ్ళాడు. ఇక మెట్ల మార్గంలోని మోకాళ్ళ పర్వతం వద్ద అతడు తన మోకాళ్లపై మెట్లు ఎక్కాడు.
ఈ వీడియోను అతడు తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేసాడు. దీంతో ఆ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. వైకుంఠ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని అతడు తిరుమల వచ్చినట్టు సమాచారం. ఇటీవలి కాలంలో సత్తా చాటుతున్న నితీష్ అటు బ్యాటింగ్ తో పటు ఇటు బౌలింగ్ లోను రాణిస్తున్నాడు ఫలితంగా జట్టు విజయాల్లో కీలక భూమిక పోషిస్తున్నాడు.
తెలుగు నేల నుంచి అజారుద్దీన్, అంబటి రాయుడు, తిలక్ వర్మ వెళ్ళందరితో పాటు టీమిండియా జట్టులో చోటు దక్కించుకున్న నితీష్ వారి కంటే కూడా మెరుగ్గా రాణిస్తున్నాడు. భవిష్యత్తులో భారత జట్టుకు అతడు ఓ ఆశా కిరణం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అల్ రౌండర్ గా నితీష్ జట్టులో తన స్థానాన్ని దాదాపుగా సుస్థిరం చేసుకున్నట్టేనని చెప్పాలి.