కొద్ది రోజుల క్రితం రగులుకున్న మాయదారి కార్చిచ్చు.. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ మహానగరం ఇప్పుడు మరుభూమిగా మార్చింది. సంపదతో తులతూగుతూ.. విలాసవంత జీవనానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లు ఉండే ఈ మహానగరం.. ఇప్పుడు గుర్తు పట్టలేనంతగా మారిపోయింది. వేలాది ఇళ్లు కాలి బూడిద అయ్యాయి.
వాటిల్లో అత్యంత ఖరీదైన భవనాలు ఉన్నాయి. ఈ కార్చిచ్చు కారణంగా జరిగిన ఆస్తి నష్టం దగ్గర దగ్గర రూ.15 లక్షల కోట్లకు పైనే ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదంతా ఒక అంచనా మాత్రమేనని.. వాస్తవంలో అంతకు మించి ఉంటుందని చెబుతున్నారు.
ఇప్పటివరకు కార్చిచ్చు కారణంగా జరిగిన నష్టాన్ని అధికారికంగా వెల్లడించలేదు. ఆస్తినష్టానికి మించిన పర్యావరణ నష్టాన్ని చాలామంది లెక్క వేయట్లేదు. ఈ కార్చిచ్చు కారణంగా.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు.. పొగను అంతరిక్షంలోని ఉపగ్రహాల నుంచి కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయంటే.. తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
తాజాగా ఈ కార్చిచ్చు బారిన పడిన ఒక విలాసవంతమైన భవనం మొత్తం నాశనమైంది. అత్యంత విలాసవంతమైన ఈ భవనం విలువ సుమారు 125 మిలియన్ డాలర్లుగా చెబుతున్నారు. మన రూపాయిల్లో చెప్పాలంటే రూ.1077 కోట్లకు పైనే. ఈ విషయాన్ని పలు అంతర్జాతీయ మీడియా కథనాలు స్పష్టం చేస్తున్నాయి.
లాస్ ఏంజెలెస్ లోని పసిఫిక్ పాలిసేడ్స్ ప్రాంతానికి చెందిన ఈ విలసవంతమైన భవనం ఇప్పుడు శిథిలంగా మారింది. 18 పడకల ఈ ఖరీదైన భవన యజమాని లుమినార్ టెక్నాలజీస్ సీఈవో ఆస్టిన్ రస్సెల్. దీనిని అద్దెకు ఇస్తేనే రూ.3 కోట్లకు పైనే వస్తుంది. సక్సెషన్ అనే టీవీ సీరిస్ లో ఈ ఇల్లు కనిపిస్తుంది. అలా ఈ ఇంటి సౌందర్యం బాహ్య ప్రపంచానికి తెలిసింది.
అబ్బుర పరిచే ఫర్నీచర్.. చూసినంతనే మనసులో ముద్ర వేసే గార్డెన్స్ అన్నీ కాలి బూడిద అయ్యాయి. ఈ మాయదారి కార్చిచ్చుతో లాస్ ఏంజెలెస్ సంపద ఆవిరైపోయింది. ఎటు చూసినా.. పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిన ఇళ్లు.. దర్శనమిస్తున్నాయి. ధనవంతులు.. సెలబ్రిటీలు.. హాలీవుడ్ తారలు మంటల ధాటికి ఇళ్లను వదిలేసి వెళ్లిపోయారు. దీంతో.. వారి ఇళ్లల్లోని విలువైన వస్తువుల్ని దొంగలు దోచుకుంటున్నారు.
కార్చిచ్చు కారణంగా చోటు చేసుకున్న ఆస్తి నష్టాన్ని అంచనా వేసింది ఆక్యువెదర్ సంస్థ. దీని అంచనాల ప్రకారం సుమారు 150 బిలియన్ డాలర్లకు పెరగొచ్చని చెబుతున్నారు. ఈ విపత్తుతో అమెరికా బీమా రంగం కుదేలు కావటం ఖాయమంటున్నారు. జేపీ మోర్గాన్.. మార్నింగ్ స్టార్ అంచనాల ప్రకారం 20 బిలియన్ డాలర్ల వరకు బీమా సంస్థలకు నష్టం రావొచ్చని చెబుతున్నారు.
కొన్ని నెలల క్రితం పాలిసాడ్స్ లోని కొన్ని ప్రాంతాల్లోని ఇళ్లకు కార్చిచ్చు ముప్పు ఉందని గ్రహించిన అతి పెద్ద బీమా సంస్థ స్టేట్ ఫామ్ బీమా పాలసీలు ఇవ్వటం మానేసింది. అలాంటి జాగ్రత్తలు తీసుకున్న సంస్థలు మినహా.. మిగిలిన సంస్థల పరిస్థితి దయనీయంగా మారిందన్న మాట వినిపిస్తోంది.
This post was last modified on January 12, 2025 6:27 pm
పార్టీ పిరాయింపుల వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వావాదానికి దారి తీసింది. ముగ్గురు మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ,…
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు…
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కిందా మీదా పడుతున్న పాకిస్థాన్ దశ తిరిగే విషయం వెలుగు చూసింది. ఆ దేశంలోని పంజాబ్…
అగ్రరాజ్యం అమెరికాలో ధనవంతులు నివసించే ప్రాంతం అది! కడుక్కున్న కాళ్లతో అక్కడ అడుగులు వేసినా ముద్రపడతాయేమో.. మట్టి అంటుతుందేమో.. అని…
ఉత్తరప్రదేశ్లోని పవిత్ర ప్రయాగ్రాజ్ జిల్లాలో సోమవారం(జనవరి 13) నుంచి 45 రోజుల పాటు జరగను న్న మహా కుంభమేళాకు సర్వం…
సీనియర్ స్టార్ హీరోల్లో వరసగా మూడు బ్లాక్ బస్టర్లున్న హీరో ప్రస్తుతం బాలకృష్ణ ఒక్కరే. రెండో హ్యాట్రిక్ కు శ్రీకారం…