జార్ఖండ్‌లో జరిగిన ఎయిర్ అంబులెన్స్ ప్రమాదం ఇప్పుడు అనేక అనుమానాలకు తావిస్తోంది. రాంచీ నుండి ఢిల్లీకి రోగిని తరలిస్తుండగా చత్రా జిల్లాలోని అటవీ ప్రాంతంలో కూలిపోయిన ఈ విమానంలో ఉన్న ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన జరిగి రెండు రోజులు గడుస్తున్నా, ప్రమాదానికి గల అసలు కారణాలను వెతకడం అధికారులకు సవాలుగా మారింది. విచారణలో బయటపడుతున్న విషయాలు విమానయాన భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రమాదానికి గురైన ‘బీచ్‌క్రాఫ్ట్ కింగ్ ఎయిర్’ విమానం ఏకంగా 39 ఏళ్ల నాటిది. 1987లో తయారైన ఈ విమానం ఇప్పటివరకు 6,600 గంటల పాటు ప్రయాణించింది. రెడ్‌బర్డ్ ఎయిర్‌వేస్ సంస్థకు చెందిన ఈ విమానం 2018 నుండి 2022 వరకు అసలు వాడకంలోనే లేదు. నాలుగేళ్ల పాటు మూలనపడ్డ పాత విమానాన్ని మెడికల్ ఎమర్జెన్సీ కోసం వాడటంపై ఇప్పుడు విమర్శలు వస్తున్నాయి. కేవలం ఎనిమిది లక్షల రూపాయల కోసం రోగి ప్రాణాలతో ఆడుకున్నారని బాధితుడి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఈ ప్రమాదంలో అత్యంత కీలకమైన ‘బ్లాక్ బాక్స్’ (CVR/FDR) ఈ విమానంలో లేదు. సాధారణంగా విమానం కూలిపోవడానికి ముందు ఏం జరిగిందో తెలుసుకోవడానికి ఈ పరికరం ఉపయోగపడుతుంది. అయితే ఈ విమానం బరువు 5,700 కిలోల కంటే తక్కువ ఉండటం వల్ల, దీనికి బ్లాక్ బాక్స్ ఉండాలనే నిబంధన వర్తించదు. దీనివల్ల పైలట్లు చివరి నిమిషంలో ఏం మాట్లాడుకున్నారు, విమానంలో ఎలాంటి సాంకేతిక లోపాలు వచ్చాయనేది తెలుసుకోవడం ఇప్పుడు కష్టంగా మారింది. కేవలం రాడార్ సమాచారం, శిథిలాల ఆధారంగానే దర్యాప్తు సాగించాల్సి ఉంది.
ప్రమాదం జరిగిన సమయంలో వాతావరణం కూడా అనుకూలించలేదు. గాలిలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడుతుండటంతో పైలట్ విమానాన్ని దారి మళ్లించేందుకు అనుమతి కోరినట్లు సమాచారం. అదే సమయంలో ఆ రూట్‌లో వెళ్లిన ఇతర సంస్థల విమానాలు కూడా వాతావరణం బాగోలేదని రిపోర్ట్ చేశాయి.
టేకాఫ్ అయిన 23 నిమిషాలకే రాడార్‌తో సంబంధాలు తెగిపోవడం, ఆ వెంటనే అడవిలో కూలిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ విషాదంలో పేషెంట్ సంజయ్ కుమార్ (41) తో పాటు ఒక డాక్టర్, పారామెడిక్ సిబ్బంది, ఇద్దరు సహాయకులు, ఇద్దరు పైలట్లు మరణించారు. ప్రాణాలు కాపాడుకోవడానికి విమానం ఎక్కితే, అదే విమానం ప్రాణాలు తీయడం అందరినీ కలచివేస్తోంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
This post was last modified on February 25, 2026 11:20 pm
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…