తెలుగు వారి నూతన సంవత్సరాది ఉగాది మరో 20 రోజుల్లో రానుంది. ఏటా వచ్చే పండుగే కదా.. ఏముంది ? అనే మాట వినిపించడం సహజం. ఉగాది రోజు కొత్త దుస్తులు ధరించి.. పచ్చడి చేసుకుని తినడమే కదా.. అనుకుంటే.. ఈ ఏడాది మాత్రం అలా ఉండదు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు.. వేస్తున్న అడుగుల కారణంగా.. ఈ ఏడాది ఉగాది చాలా స్పెషల్ గురూ అని అనకుండా ఉండలేదు.
దీనికి ప్రధానంగా 3 కారణాలు ఉన్నాయి. 1) ఉగాది రోజు జాబ్ క్యాలెండర్ విడుదల చేయనున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లోనూ కలిపి ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి సంబంధించి ఈ జాబ్ క్యాలెండర్‌ను విడుదల చేసేందుకు మంత్రి నారా లోకేష్ యుద్ధప్రాతిపదికన రెడీ అవుతున్నారు. దీనిలోనే డీఎస్సీ ప్రకటన కూడా ఉంటుందని చెబుతున్నారు. సో.. ఈ ఉగాది నిరుద్యోగులకు భారీ అవకాశాలనే తీసుకు రానుంది.
2) టిడ్కో ఇళ్లు: ఈ ఉగాది సందర్భంగా రాష్ట్రంలో 2 లక్షల పైచిలుకు లబ్ధిదారులకు టిడ్కో ఇళ్లను అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి సంబంధించిన పనులు కూడా చాలా వేగంగా ముందుకు సాగుతున్నాయి. గత ఏడాది 3.5 లక్షల మందికి టిడ్కో ఇళ్లను ఇచ్చారు. ఈ దఫా మరో 2.5 లక్షల మందికి ఈ ఇళ్లను అందించనున్నారు. ఉగాది రోజు వారందరితోనూ గృహ ప్రవేశాలు చేయించాలని నిర్ణయించుకున్నారు. సో.. ఇది సొంతింటి కోసం కలలుకంటున్న వారికి మేలు చేసే ఉగాదిగా మార నుంది.
3) రాజధానిలో రెండో దశ పనులకు శ్రీకారం: అమరావతి రాజధాని నిర్మాణంలో భాగంగా ప్రస్తుతం తొలి దశ పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అయితే.. రెండో దశ పనులను కూడా ఉగాది నాడు ప్రారంభించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు.
తొలిదశలో అధికారుల ఇళ్ల నిర్మాణం చేపట్టారు. అదేవిధంగా శాశ్వత హైకోర్టు నిర్మాణ పనులు కూడా వేగంగా సాగుతున్నాయి. రెండో విడతలో ప్రధాన రాజధాని పనులను ప్రారంభించనున్నారు. తద్వారా అమరావతికి వచ్చే రెండేళ్లలో సమగ్రరూపం ఇవ్వనున్నారు. సో.. ఇలా ఈ ఏడాది ఉగాది.. ప్రత్యేకంగా మారనుంది.
This post was last modified on February 26, 2026 6:24 am
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…