Trends

ఏపీలో ఏడు విమానాశ్రయాలు.. ఎక్కడెక్కడంటే..

ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో రాష్ట్రంలో కొత్తగా ఏడు విమానాశ్రయాలు నిర్మించేందుకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులు ఆర్థిక, వాణిజ్య అవసరాల కోసం కీలకమైనవిగా భావిస్తున్నారు. కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని, అన్నవరం, ఒంగోలులో ఈ విమానాశ్రయాలను ఏర్పాటు చేయనున్నారు. ముఖ్యమంత్రి పౌరవిమానయాన శాఖ అధికారులతో సమావేశమై, ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహించారు.

ప్రధానంగా కుప్పం విమానాశ్రయం రెండు దశల్లో నిర్మించనున్నారు. మొదటి దశలో 683 ఎకరాలు, రెండో దశలో 567 ఎకరాలను కేటాయించారు. శ్రీకాకుళం విమానాశ్రయం నిర్మాణానికి సంబంధించిన ఫీజిబిలిటీ సర్వే పూర్తయ్యింది. దగదర్తి విమానాశ్రయం కోసం 1,379 ఎకరాలు అవసరమని తేలింది. నాగార్జునసాగర్‌లో 1,670 ఎకరాలు, తుని-అన్నవరం మధ్య 757 ఎకరాలు గుర్తించారు.

గన్నవరం విమానాశ్రయ విస్తరణలో భాగంగా నూతన టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం ఆకృతుల్లో నిర్మించనున్నారు. ఈ నిర్మాణాన్ని 6 నెలల్లో పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భోగాపురం విమానాశ్రయం పురోగతిపై సమీక్ష చేపట్టింది. తెదేపా హయాంలో ప్రతిపాదించిన ఈ ప్రాజెక్టులు వైకాపా ప్రభుత్వం వచ్చిన తరువాత నిలిచిపోయాయని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం మళ్లీ వాటిని అమలు చేయడానికి కృషి చేస్తుందని చంద్రబాబు తెలిపారు. కొత్త విమానాశ్రయాలతో ప్రాంతీయ అభివృద్ధికి ఊతమిచ్చే అవకాశముంది.

This post was last modified on January 4, 2025 3:17 pm

Share
Show comments
Published by
Satya
Tags: Airports

Recent Posts

భారత్ లో తొలి హెచ్ఎంపీవీ కేసు?

సరిగ్గా ఐదేళ్ల క్రితం ప్రపంచానికి పరిచయమైన కరోనా వైరస్ ప్రజల జీవితాలను అతలాకుతలం చేసింది. కరోనాకు ముందు కరోనాకు తర్వాత…

20 minutes ago

గేమ్ ఛేంజర్ నెగిటివిటీ : దిల్ రాజు కాన్ఫిడెన్స్!

సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలను నిర్మించి రిలీజ్ చేయడంతో పాటు మరో భారీ చిత్రాన్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్న నిర్మాత దిల్…

51 minutes ago

విశాల్ ఇలా కనిపించడం ఆందోళనే

నిన్న చెన్నైలో జరిగిన మదగజరాజ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో హీరో విశాల్ లుక్స్ చూసి అందరూ షాక్ తిన్నారు.…

1 hour ago

ఆ ఒక్క చేప ఖరీదు 11 కోట్లు!

ప్రతి సంవత్సరం జపాన్‌లో నూతన సంవత్సరం వేళ అరుదైన చేపల వేట విశేషంగా నిలుస్తుంది. ఈసారి టోక్యోలోని ప్రముఖ చేపల…

2 hours ago

క‌మ్మ వారిని జ‌గ‌న్‌ వేధించారు: మాజీ ఐపీఎస్ ఫైర్‌

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ఐపీఎస్ మాజీ అధికారి.. జ‌గ‌న్ ప్ర‌భుత్వంలో పూర్తిగా స‌స్పెన్షన్‌కు గురైన ఆలూరి బాల…

3 hours ago

ఈ చిన్ని మార్పులతో చక్కటి ఆరోగ్యం మీ సొంతం…

ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిత్యం ఏదో ఒక ఇన్ఫెక్షన్.. వైరస్ లాంటివి అందరినీ భయపెడుతున్నాయి. ఇది మనకు సోకడానికి ముఖ్య…

6 hours ago