మరికొన్ని గంటల్లో ప్రపంచ వ్యాప్తంగా కొత్త సంవత్సర వేడుకలు ఘనంగా జరగనున్నాయి. దీనికి సంబంధించి ప్రజలు కూడా మానసికంగా సిద్ధమయ్యారు. భారత్ సహా.. అన్ని దేశాలూ కూడా.. ఇటీవల కాలంలో ఘనంగా ఈ వేడుకలను నిర్వహించుకుం టున్నాయి. ఒక్క కొరియా మాత్రమే ఈ వేడుకలకు దూరం.
తాజాగా 179 మంది ప్రయాణికులు విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడంతో దక్షిణ కొరియా సైతం ఈ సారి అధికారిక వేడుకలను రద్దు చేసుకుంది. ఇజ్రాయెల్, పాలస్తీనాలు, ఉక్రెయిన్ కూడా.. ఈ సారి వేడుకలకు దూరంగా ఉన్నాయి. అలాగే అఫ్ఘాన్ కూడా.. వేడుకలకు దూరంగా ఉంది.
కొత్త సంవత్సరం వేడుకలపై అఫ్ఘాన్‌లోని తాలిబన్ పాలకులు.. నిషేధం విధించారని వార్తలు వచ్చాయి. దీంతో అక్కడ కూడా వేడుకలకు ప్రజలు దూరంగా ఉండనున్నారు. ఇక, బంగ్లాదేశ్‌లో కూడా దాదాపు నిషేధమే అమలు చేసే అవకాశం ఉందని తెలిసింది.
అక్కడ రాజకీయంగా అస్థిరత కొనసాగుతుండడం, శాంతి భద్రతలు అదుపు తప్పుతాయన్న బెంగ ఉన్న కారణంగా తాత్కాలిక ప్రధాని యూనస్.. కొత్త సంవత్సర వేడుకలను ఎవరి ఇళ్లలో వారు జరుపుకోవడమే మంచిదని వ్యాఖ్యానించారు. దీనిపై ఇంకా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
ఇక, భారత్‌లోకి వచ్చేసరికి ఏర్పాట్లు ధూంధాంగా సాగుతున్నాయి. మెట్రో నగరాల్లో 48 గంటల ముందు నుంచే ఏర్పాట్లు ప్రారంభించారు. కేకుల తయారీ కర్మాగారాలు.. రేయింబవళ్లు శ్రమిస్తున్నాయి. అయినా.. ఆర్డర్ల సంఖ్యతో పోలిస్తే..తయారీ మందగించిందని వ్యాపారులు చెబుతున్నారు.
మరోవైపు.. మద్యం వినియోగం పెరగనున్న నేపథ్యంలో డిస్టిలరీలలో కూడా సరుకు పూర్తిగా అయిపోయింది. మద్యం దుకాణాలకు ప్రభుత్వం మరో గంట అనుమతి ఇచ్చింది. హైదరాబాద్ సహా విజయవాడ, విశాఖ, ఏలూరు, రాజమండ్రి, విజయనగరం వంటి ప్రాంతాల్లో అర్ధరాత్రి 12.30 వరకు బార్లకు, 12 గంటల వరకు వైన్స్‌కు అనుమతి ఇచ్చారు.
సరే.. అసలు విషయానికి వస్తే.. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌కు పబ్బులు కూడా రెడీ అయ్యాయి. తమ క్లయింట్లకు పబ్బులు ప్రత్యేక ఆకర్షణలను కూడా జోడిస్తున్నాయి. విదేశీ మద్యంపై 5 శాతం, స్వదేశీ తయారీ విదేశీ మద్యంపై 10 శాతం రాయితీలు ఇస్తున్నా యి. ఇదిలావుంటే.. మహారాష్ట్రలోని పుణేలో ఓ పబ్ నిర్వాహకులు చిత్రమైన ఘటనకు తెరదీశారు. తమ ఖాతా దారులకు ప్రత్యేక ఆహ్వానాలు పంపించారు. సాయంత్రం 6 నుంచే సంబరాలు ప్రారంభమవుతాయని.. తిన్నంత తిని, తాగినంత తాగవచ్చని కూడా పేర్కొన్నారు.
అయితే.. ఆ ఆహ్వాన సంచుల్లో(ఇన్విటేషన్ బ్యాగ్స్) కండోమ్‌లు, ఓఆర్ ఎస్‌లు పంపించారు. ఇది.. తీవ్ర వివాదానికి దారి తీసింది. ఓ ఖాతా దారుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పబ్‌పై కేసు నమోదు చేశారు. పబ్ ఉద్దేశం మేం తాగు బోతులం.. తిరుగుబోతులమనేగా!
అని ఖాతా దారుడు నిప్పులు చెరిగాడు.
This post was last modified on December 31, 2024 10:01 am
ఈ సోషల్ మీడియా కాలంలో పెద్ద పెద్ద సినిమాలకు సంబంధించి కూడా ఆన్ లొకేషన్ ఫొటోలు, వీడియోలు లీక్ అయిపోతుంటాయి.…
ముందో విడుదల తేదీ అనుకుని పోటీ వల్ల వెనుకడుగు వేసి ఇప్పుడు కొత్త డేట్ పట్టుకునేందుకు కిందా మీద పడుతున్న…
https://youtu.be/zHiKFSBO_JE?si=HDSpx4GNEhcOje0y కొత్త సంవత్సరం తొలి ప్యాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ జనవరి 10 విడుదల కాబోతున్న నేపథ్యంలో అందరి…
టీమిండియా స్టార్ క్రికెటర్ శుభ్‌మన్ గిల్‌తో పాటు యువ క్రికెటర్లు సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మలు ఓ…
తండేల్ విడుదలకు ఇంకో 35 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటిదాకా ప్రమోషన్లు ఊపందుకోలేదు. సంధ్య థియేటర్ దుర్ఘటనలో అల్లు అర్జున్…