దక్షిణ కొరియాలో జరిగిన దారుణ విమాన ప్రమాదం తీవ్ర విషాదాన్ని నింపింది. థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ నుంచి బయలుదేరిన జేజు ఎయిర్ ఫ్లైట్ 7సి2216, ముయాన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండింగ్ చేసేందుకు ప్రయత్నిస్తూ అదుపుతప్పింది. బోయింగ్ 737-800 విమానంలో 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బంది ఉండగా, ఈ ప్రమాదంలో 179 మంది మృతిచెందారు. కేవలం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
ప్రమాద సమయంలో విమానం రన్‌వే చివరికి చేరినా, వేగాన్ని నియంత్రించలేక విమానాశ్రయం రక్షణ గోడను ఢీకొట్టింది. ఈ ఢీకొట్టుదల కారణంగా విమానం ఉన్న ఇంధనం ఒక్కసారిగా మంటలకి ఆహుతి అయింది. మంటలు పెద్దఎత్తున వ్యాపించి విమానాన్ని కాల్చి బూడిద చేశాయి. ప్రత్యక్ష సాక్షులు చెబుతున్న వివరాల ప్రకారం, ల్యాండింగ్ సమయంలో గేర్ మరియు టైర్లు పనిచేయకపోవడంతో విమానం అదుపుతప్పింది. ఏదైనా పక్షి ఢీకొన్న కారణంగా ఈ లోపాలు కలిగివుంటాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ దారుణ ఘటనపై దక్షిణ కొరియా తాత్కాలిక అధ్యక్షుడు చోయ్ సాంగ్ మోక్ స్పందించారు. అన్ని శాఖలకు తగిన ఆదేశాలు జారీ చేసి, ప్రమాదానికి కారణాలను వెలికితీయాలని ఆదేశించారు. ప్రమాదంపై విచారణ కొనసాగుతుండగా, ప్రాణాలను కోల్పోయిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ముయాన్ విమానాశ్రయాన్ని తాత్కాలికంగా మూసివేసినట్టు అధికారులు తెలిపారు. విమాన ప్రమాదం కారణంగా గాల్లో ప్రయాణం చేసే వారికి భయాందోళన తలెత్తుతోంది. ఇలాంటి ఘటనలు రాబోయే రోజుల్లో మళ్లీ జరుగకుండా ల్యాండింగ్ గేర్ ఇంధన వ్యవస్థలపై మరింత కఠినమైన భద్రతా చర్యలు చేపట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.
This post was last modified on December 29, 2024 2:33 pm
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…